ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2020-06-05T09:52:54+05:30

జిల్లాలో మనబడి నాడు-నేడు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడ్రోజుల్లో పురోగతి కనిపించాలి.. అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


అనంతపురం, జూన్‌4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మనబడి నాడు-నేడు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మనబడి నాడు-నేడు పనులకు సంబంధించి తొలిదశలో ఎంపిక చేసిన పాఠశాలలకు విడుదల చేసిన రీవాల్వింగ్‌ ఫండ్‌ నుంచి ఇటుక, ఇనుము, ఎలక్ర్టిక్‌ పరికరాలు ఇతర మెటీరియల్‌ కొనుగోలు చేయాలన్నారు. ఆ బిల్లులను వెంటనే అప్‌లోడ్‌ చేయాలన్నారు. మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ సరఫరా తదితర మరమ్మతు పనులను ఒకేసారి చేపట్టాలన్నారు. ఆదివారంలోపు పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగాలకు సంబంధించిన పనులన్నీ ప్రారంభించాలన్నారు.


వీటిని 33 శాతం పూర్తి చేయటంతోపాటు అందుకు సంబంధించిన ఫొటోలను తనకు పంపాలని  ఆదేశించారు. ఇండెంట్‌ మేరకు సంబంధిత మండలాలకు సిమెం టు, ఇసుక చేరిందో.. లేదో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఏఈలు, డీఈలు పూర్తిస్థాయిలో పనులు సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జా యింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, సచివాలయాల జేసీ సిరి, డీఈఓ శామ్యూల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈలు హరేరామనాయక్‌, మహేశ్వరయ్య, డీఈ శివకుమార్‌, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎమ్మార్సీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T09:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising