ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్కేయూలో తరగతుల నిర్వహణపై సందిగ్ధం

ABN, First Publish Date - 2020-11-03T06:54:40+05:30

ఎస్కేయూలో తరగతుల నిర్వహణపై సందిగ్ధత వీడలేదు. అన్ని విశ్వవిద్యాలయాల తరగతులతో పాటు డిగ్రీ తరగతులు సోమవారం నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినా ఎస్కేయూలో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్కేయూ, నవంబరు 2 : ఎస్కేయూలో తరగతుల నిర్వహణపై సందిగ్ధత వీడలేదు. అన్ని విశ్వవిద్యాలయాల తరగతులతో పాటు డిగ్రీ తరగతులు సోమవారం నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ  ఆదేశాలు జారీ చేసినా ఎస్కేయూలో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు. వర్శిటీలో ఒక్క విద్యార్థి కూడా విభా గాలకు హాజరు కాలేదు. వర్శిటీలోని 33 విభాగాల్లో సగం విభాగాలు అసలు తలుపులే తెరుచుకోలేదు. ప్రొఫెసర్లే చాలా విభాగాల్లో హాజరు కాలేదు.  కనీసం డిపార్ట్‌మెంట్‌ ల వైపు కన్నెత్తి చూడటం లేదనే అపవాదు ఉంది. సాధా రణంగా ఒక్కో ప్రొఫెసర్‌కు సంవత్సరానికి 21 ఐచ్ఛిక సెలవులు ఉంటాయి. కాని వర్శిటీ చాలా విభాగాల్లో ప్రొఫె సర్లు ఎప్పుడూ సెలవుల్లోనే ఉంటారు. కానీ హాజరు పట్టిక ల్లో మాతరం హాజరైనట్లు సంతకాలు ఉంటాయి.  ఇలా వర్శిటీలోని చాలా విభాగాల్లో కొనసాగుతోంది. రెగ్యులర్‌ వైస్‌చాన్సలర్‌ లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టారాజ్యంగా ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ లు ఉన్నాయి.


శానిటైజేషన ఏదీ ?

జిల్లాలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వర్శిటీ వసతి గృహాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చి బాధితు లకు చికిత్స అందించారు. అయితే వారు వాడిన బెడ్లు, సామగ్రి వసతిగృహాల్లో ఇంకా అలానే ఉన్నాయి. వర్శిటీ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్‌కు వసతిగృహాల శుభ్ర తపై వివరించాము. రెండు రోజుల్లో పేషెంట్ల బెడ్లు తరలి స్తామని పేర్కొన్నారని చెబుతున్నారు. కొవిడ్‌ బాధితుల సామగ్రి తొలగించిన తరువాతే శానిటైజ్‌ చేసి రంగులు వేస్తామని వర్శిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రి య అంతా పూర్తి కావడానికి కనీసం 20 రోజులైనా పట్టే అవకాశముంది. జిల్లాకు చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల విద్యార్థులు కూడా వర్శిటీలో  విద్యనభ్యసిస్తున్నా రు. విద్యార్థులు హాజరుకావాలంటే కచ్చితంగా వసతిగృహా లు సిద్ధం చేయాలి. కరోనా బాధితులను వసతిగృహాల్లో ఉంచి చికిత్స అందించడంతో  చాలా మంది విద్యార్థులు వర్శిటీకి రావాలంటే భయపడుతున్నారు. 


తరగతుల ప్రారంభంపై కొరవడిన స్పష్టత

ఎస్కేయూలో తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు. ఈ అంశంపై ప్రిన్సిపాల్‌ శంకర్‌నాయక్‌ను సంప్రదించగా మంగళవారం రిజిస్ర్టార్‌తో చర్చించి తరగతుల నిర్వహణపై నిర్ణయి స్తామని తెలిపారు.


Updated Date - 2020-11-03T06:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising