ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురంలో మరో ఆరు పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-05-23T10:38:52+05:30

కరోనా వైరస్‌ హిందూ పురంలో కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా శుక్రవారం అంబేడ్కర్‌నగర్‌లో ఐదుగురికి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం, మే 22 : కరోనా వైరస్‌ హిందూ పురంలో కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా శుక్రవారం అంబేడ్కర్‌నగర్‌లో ఐదుగురికి, అజాద్‌నగర్‌లో మరొకరికి వైరస్‌ సోకింది. వీరిలో నలుగురు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. ఇప్పటికే వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల్లో వృద్ధులే అధికంగా ఉ న్నారు. గురువారం కె బసవనపల్లిలో కూరగాయల తోపుడు బండి వ్యాపారికి వైరస్‌ సోకినట్టు తెలియడంతో గ్రామంతోపాటు పట్టణంలో కూరగాయలు కోనుగోలు చేసిన వారిలో కాంటాక్ట్‌ ఆందోళన నెలకొంది.

  

కరోనా ఫుల్‌.. ఖాళీ అవుతున్న క్వారంటైన్‌ కేంద్రాలు

పట్టణంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 146కు చేరుకుంది. ఈకేసుల మొదటి, రెండవ కాంటాక్ట్‌ అనుమా నితులతో పాటు కరోనా లక్షణాలు ఉన్న వారిని అధికార యంత్రాం గం క్వారంటైన్‌కు తరలిస్తోంది. ఇందుకోసం పట్టణంలో మూడు క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పది రోజు ల కిందటి వరకు వందల మందితో క్వారంటైన్‌ కేంద్రాలు నిండి ఉండేవి.


వారం రోజులుగా ఈ కేంద్రాలు ఖాళీ అవు తున్నాయి. సప్తగిరిలో మాత్రమే శుక్రవారం సాయంత్రా నికి 76 మంది దాక ఉన్నట్లు చెబుతున్నారు. పట్టణంలో పాజిటివ్‌ కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో కాంటాక్ట్‌ను గుర్తించినా కొందరు క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానితుల్ని తరలించేం దుకు అధికార యంత్రాంగం ప్రయత్నించినా ఓవర్గం ప లు రకాల ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యం లోనే క్వారంటైన్‌ క్రమంగా ఖాళీ అవుతూ స్వీయ నిర్బం ధం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.  

Updated Date - 2020-05-23T10:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising