ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శాంపిల్స్‌’ను త్వరగా పరీక్షలకు పంపాలి

ABN, First Publish Date - 2020-04-02T10:41:31+05:30

దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో నిర్వహించిన జమాతే కు వెళ్లొచ్చిన వారి నుంచి శాంపిల్స్‌ త్వరగా సేకరించి పరీ క్షలకు పంపా లని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సంబం ధిత అధికారు లను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


అనంతపురం, ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి) : దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో నిర్వహించిన జమాతే కు వెళ్లొచ్చిన వారి నుంచి శాంపిల్స్‌ త్వరగా సేకరించి పరీ క్షలకు పంపా లని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సంబం ధిత అధికారు లను ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాల యం నుంచి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజా, డ్వామా పీడీ ప్రసాద్‌ బాబులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. నిజాముద్దీన్‌ జమా తేకు వెళ్లొచ్చిన వారిని స్థానిక టీటీడీసీ, సీఆర్‌ఐటీ భవనాల్లో ఉంచామన్నారు. వారి నుంచి శాంపిల్స్‌ సేకరించడంలో ఆలస్యం జరుగుతోంద న్నారు. ఆలస్యం కావడం మూలంగా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.


ఈ నేపథ్యంలో శాంపిల్స్‌ సేకరణ విషయంలో వేగం పెంచాల న్నారు. నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన వారికి సంబంధించిన శాంపిల్స్‌ సేకరణ వివరాల గురించి డీఎంహెచ్‌ఓ కలెక్టర్‌కు వివరిం చారు. టీటీడీసీలో 49 మంది శాంపిల్స్‌ మంగళవారం రాత్రి సేకరించామని సీఆర్‌ఐటీలో ఉన్న 60 మందిలో 25 మంది నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారేనన్నారు. ఆ 25 మంది నుంచి శాంపిల్స్‌ను ముగ్గురు వైద్యుల ద్వారా సేక రించామన్నారు. వాటిని పరీక్షల నిమిత్తం మెడికల్‌ కాలేజీ లోని ల్యాబ్‌కు పంపామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల నుం చి మంగళవారం రాత్రి సేకరించిన 49 నమూనాలే బుధ వారం ఉదయం ల్యాబ్‌కు వచ్చాయని వైద్యకళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ నీరజా కలెక్టర్‌కు వివరించారు. 

Updated Date - 2020-04-02T10:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising