ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైన్స ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2020-12-30T07:11:49+05:30

మండలంలోని చెరువుమరవపల్లి సమీపంలో ప్రారంభించబోవు శ్రీ బాలాజీమైన్సపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌ పాల్గొన్నారు

సమావేశంలో మాట్లాడుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజరైన జేసీ నిశాంతకుమార్‌ 

తలుపుల, డిసెంబరు 29: మండలంలోని చెరువుమరవపల్లి సమీపంలో ప్రారంభించబోవు శ్రీ బాలాజీమైన్సపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌ పాల్గొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన సూర్యనారాయణరెడ్డి బాలాజీ మైన్స పేరుతో వైట్‌క్వార్జ్‌ మైన్సకోసం 7.05 హెక్టార్లకు ధరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చెరువుమరవపల్లి మైన్స కల్లాలగుట్టవద్ద స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. ప్రజలు మాట్లాడుతూ మైన్స వలన పంటలకు నష్టం జరిగితే చెల్లించాలని, మామిడితోటలకు మైనవలన దుమ్ము, ధూళి వలన నష్టం జరుగకుండా చూడాలని, సమీప గ్రామాలలో తాగునీరు, వైద్యశిబిరాలు, రహదారులు వేయించాలన్నారు. బాలాజీ మైన్స అధినేత సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజలకు నష్టం జరుగకుండా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌, ఆర్‌డీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసగౌడ్‌, డీటీ రవీ, ఆర్‌ఐ రమణబాబు, మైన్స సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T07:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising