ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ లేకుంటే జరిమానా

ABN, First Publish Date - 2020-06-18T10:03:57+05:30

మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తారని ప్రజలకు అవ గాహన కల్పించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భౌతికదూరం పాటించకుంటే క్వారంటైన్‌

ప్రజలకు అవగాహన కల్పించండి

కొవిడ్‌ కేర్‌ సెంటర్లను 

అన్ని విధాలా సిద్ధం చేయండి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


అనంతపురం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తారని ప్రజలకు అవ గాహన కల్పించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో డీఐజీ కాంతి రాణాటాటా, ఎస్పీ సత్యఏసు బాబు, జాయింట్‌ కలెక్టర్‌లు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి, పద్మావతిలతో కలిసి కొవిడ్‌-19పై సమీక్షించారు.  కొవిడ్‌-19కు సంబంధించి కంటైన్మెంట్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని 10 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో అన్ని రకాల వసతుల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.


బారిన పడకుండా ప్రజలను మరింత అప్రమత్తం చేయాలన్నారు. మాస్కుల వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.   జిల్లాలో 60 ఏళ్లుపైబడిన వారు, కరోనా సీరియస్‌ కేసులకు సంబంధించి శాంపిళ్లు సేకరించిన వెంటనే పరీక్షలు ని ర్వహించాలని తెలిపారు. కరోనాతో ఎవరూ మరణించ కుండా చర్యలు తీసుకోవాలన్నారు. కదిరి డివిజన్‌లో శాంపిళ్ల సేకరణ మరింత పెంచాలన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిని డిశ్చార్జ్‌ చేసేందుకు ట్రూనాట్‌ మిషన్‌ ద్వారా త్వరగా  టెస్టింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నా రు. కరోనా సోకిన వారికి తక్కువ లక్షణాలు కనబడితే వారిని హోం క్వారంటైన్‌లో ఉంచే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. తక్కువ వయసున్న వా రికి పాజిటివ్‌ వచ్చినా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమ్‌ ఐసొ లేషన్‌లో ఉండేలా చూడాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఎక్కువ బృందాలతో శాంపిళ్లు సేకరించాలన్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించని వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపిస్తామని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.


వైద్యాధికారులు, ఆయూష్‌ డాక్టర్లు, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు కొవిడ్‌-19పై శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌, ప్రభుత్వాస్ప త్రి సూపరింటెం డెంట్‌ రామస్వామి నాయక్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ ప ద్మావతి, మున్సిపల్‌ కమిషనర్‌ మూర్తి, ఆర్డీఓ గుణభూష ణ్‌రెడ్డి, తహసీల్దార్‌ అనుపమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-18T10:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising