ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
ABN, First Publish Date - 2020-12-29T05:35:12+05:30
జాతీయ కాం గ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.
అనంతపురం రైల్వే, డిసెంబర్ 28: జాతీయ కాం గ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా ప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జగ్జీవన రామ్, పోట్టిశ్రీరాములు, కల్లూరి సుబ్బారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమా లలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందుగా జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాగ్దానాలు విస్మరించి పాలన సాగిస్తున్నాయని దుయ్యబ ట్టారు. కార్యక్రమంలో నాయకులు ఏపీసీసీ అధికార ప్రతి నిధి నాగరాజు, ఎస్సీసెల్ రాష్ట్రనాయకులు శంకర్, రాష్ట్ర మైనార్టీ నాయకులు దాదాగాంధీ, రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, శివశంకర్ యాదవ్, సురేష్, జిల్లా ఉపా ధ్యక్షులు వాసు, రామానాయుడు, నాయకులు ఫకృద్దీన, అబ్బాస్, ఆంజనేయులు, నాగరాజు, శర్మాస్, సుబాన, కృష్ణ, హరి పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T05:35:12+05:30 IST