ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌ల నిరాకరణ

ABN, First Publish Date - 2020-07-09T09:54:21+05:30

కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌ యాజమాన్యాలు నిరాకరించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, జూలై 8: కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌ యాజమాన్యాలు నిరాకరించాయి. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అనుమానితుల సంఖ్య అదే స్థా యిలో పెరిగిపోతోంది. శాంపిళ్లు విరివిగా సేకరిస్తే ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల్లో ఆ మేరకు నిర్ధారణ పరీక్షలు చేయలేకపోతున్నా రు. దీంతో వేలాది నమూనాలు ల్యాబ్‌లో పెం డింగ్‌ పడిపోతున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రైవేలు ల్యాబ్‌లలో కూడా కరోనా పరీక్షల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఆలోచించింది. ఆ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ల్యాబ్‌ల యజమానులతో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమైన సత్యం, స్టార్‌, అపెక్స్‌, వెంకట్‌ తదితర ఆరు ల్యాబ్‌ల యజమానులు మాత్రమే హాజరయ్యారు. కరోనా పరీక్షలకు సహకరించాలని జేసీ డాక్టర్‌ సిరి సూచించారు. సంబ ంధిత యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఒక్కో శాంపిల్‌ పరీక్షకు నిబంధనలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తామన్నారు. ఇందుకు ల్యాబ్‌ యజమానులు నిరాకరించారు. ఇప్పటికిప్పుడు యం త్రాలు కొనుగోలు చేయలేమనీ, కరోనా పరీక్షలు సాధ్యం కాదని జేసీకి సూచించారు. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌ల నిర్ణయం నిరాశపరిచింది.

Updated Date - 2020-07-09T09:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising