ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అనంత’లో అందుబాటులో ప్లాస్మా థెరపీ

ABN, First Publish Date - 2020-08-07T10:44:44+05:30

జిల్లా సర్వజనాస్పత్రిలో కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా థెరపీని అందు బాటులోకి తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభించిన కలెక్టర్‌, ఎంపీ


అనంతపురం వైద్యం అగస్టు 6: జిల్లా సర్వజనాస్పత్రిలో కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా థెరపీని అందు బాటులోకి తీసుకువచ్చారు. గురువారం జిల్లా సర్వజనాస్పపత్రిలో కలెక్టర్‌ గంధం చంద్రుడు,  ఎంపీ తలారి రంగయ్య ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరస్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను అందిస్తే విషమంగా ఉన్న కరోనా బాధితులప్రాణం నిలుస్తుందన్నారు. ఎవరి శరీరంలో యాంటిబాడీస్‌ అభివృద్ధి చెంది ఉంటే వారి నుంచి మాత్రమే ప్లాస్మా తీసుకుంటారన్నారు.


జిల్లాలో ఇప్పటికే 13 వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారని వారందరూ ప్లాస్మాను దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేసిన వారికి ప్రభుత్వం రూ.5 వేలు పారితోషికం అందిస్తుందన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న జిల్లా పంచాయతీ అధికారి రామనాథ్‌రెడ్డి ప్లాస్మాను దానం చేయగా అయనను కలెక్టర్‌, ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ సిరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్‌ నవీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T10:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising