ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కుబడిగా..!

ABN, First Publish Date - 2020-07-07T10:10:28+05:30

జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. సాధారణంగా జూన్‌, జూలై నె లల్లో వర్షాలు కురసేలోపు జిల్లాలో లక్ష్యానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నామమాత్రంగా మొక్కల పెంపకం..

సమృద్ధిగా వర్షం కురిసినా పుంజుకోని వైనం..

మరికొన్ని చోట్ల గుంతలే కొట్టని దుస్థితి..

అధికారుల నిర్లక్ష్యం..

నిధుల విడుదలలో ఆలస్యమే 

కారణమంటున్న యంత్రాంగం..


అనంతపురం రైల్వే, జూలై6: జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. సాధారణంగా జూన్‌, జూలై నె లల్లో వర్షాలు కురసేలోపు జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటడానికి గుంతలు కొట్టించి, సిద్ధంగా ఉండాలి. రెండుమూడేళ్లుగా ఇలానే చేస్తున్నారు. గతేడాది గుంతలు కొట్టించి, సిద్ధంగా ఉంచుకున్నా.. సకాలంలో వర్షాలు కురవలేదు. చివరికి మోస్తారు వర్షం పడటంతో సిద్ధంగా ఉన్న గుంతల్లో మొక్కలు నాటించి, మమ అనిపించారు. ఈ ఎడాది అందుకు భిన్నంగా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. సమృద్ధిగా వర్షం వచ్చినా మొక్కలు నాటడానికి తగిన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా అంచనాలకు అనుగుణంగా మొక్కలు నాటించటానికి గుంతలు కొట్టించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


నూతన పథకానికే ప్రాధాన్యం

నూతనంగా జిల్లాలో 600 హెక్టార్ల అటవీప్రాంతంలో పూలమొక్కలు నాటేందుకు నూతన పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకానికి సమృద్ధిగా నిధులు కూడా ఉన్నాయి. దీంతో జిల్లాలోని అనంతపురం, గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, పెనుకొండ, బుక్కపట్నం రేంజ్‌లలో 100 హెక్టార్ల చొప్పున అటవీ రిజర్వుప్రాంతంలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీనిని కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. మరికొన్ని చోట్ల గుంతలు కూడా తీయలేదన్న విమర్శలున్నాయి.  అటవీశాఖ ఈ పథకాలకే పరిమితమై, మిగిలిన ప్రాంతాల్లో మొక్కలు నాటే బాధ్యతలు మిగిలిన విభాగాల భాగస్వామ్యంతో మమ అనిపించేలా చర్యలు చేపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులు విడుదల కాకపోవటంతో మరింత ఆలస్యమవుతుందన్న చర్చ సాగుతోంది.


నిధులు విడుదల కాకనే ఆలస్యం: జగన్నాథ్‌సింగ్‌, జిల్లా అటవీశాఖాధికారి

జిల్లాలో వర్షం సమృద్ధిగా కురిసింది. అందుకనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో గుంతలు కొట్టించి, మొక్కలు నాటిస్తున్నాం. పూర్తిస్థాయిలో అంచనాలకు అనుగుణంగా మొక్కలు నాటడానికి నిధులు విడుదల కాకపోవటం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ ఎడాది 94 లక్షల మొక్కలు నాటేలా అంచనాలు తయారు చేశాం. లక్ష్యం పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాం.

Updated Date - 2020-07-07T10:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising