ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలు రాయకపోయినా పాస్‌

ABN, First Publish Date - 2020-03-27T09:49:49+05:30

పరీక్షలు రాయకపోయినా పాసైనట్లే. పాఠ శాలల్లో ఎంతమంది ఉంటే...అందరూ ఉత్తీర్ణులయినట్లే లెక్క. 6 నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులెవరూ సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌- 2 పరీక్షలు (వార్షిక పరీక్షలు) రాయకపోయినా అందరినీ పాస్‌ చేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

6 నుంచి 9వ తరగతి వరకూ వెసులుబాటు... సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌-2 

పరీక్షలు రద్దు... ఆర్‌జేడీ, డీఈఓలకు విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు


అనంతపురం విద్య, మార్చి 26: పరీక్షలు రాయకపోయినా పాసైనట్లే.  పాఠ శాలల్లో ఎంతమంది ఉంటే...అందరూ ఉత్తీర్ణులయినట్లే లెక్క. 6 నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులెవరూ సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌- 2 పరీక్షలు (వార్షిక పరీక్షలు) రాయకపోయినా అందరినీ పాస్‌ చేస్తారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిన్నవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌- 19 నియంత్రణలో భాగంగా కేంద్రం ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలు కూడా పని చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో 6 నుంచి 9 వ తరగతి వరకూ ఎస్‌ఏ -2 పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వాటిని రద్దుచేశారు. 6 నుంచి 9వ తరగతి వరకూ చదివే విద్యార్థులందరినీ ఈ ఏడాది పాస్‌ చేయనున్నా రు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యార్థులు  పరీక్షలు రాయకపోయినా ఉత్తీర్ణత సాధించినట్లే. విద్యాశాఖ చరిత్రలో ఇలా పాస్‌ చేయడం ఇదే మొదటిసారి. 

Updated Date - 2020-03-27T09:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising