‘ఆసరా’కు నో క్యాష్
ABN, First Publish Date - 2020-09-20T09:06:29+05:30
వైఎస్సార్ ఆసరా కింద మంజూరైన నగదు విత్‌డ్రాకు వెళ్లిన మహిళా సంఘాల సభ్యులతో బ్యాంకు అధికారులు నోక్యాష్ అని చెబుతుండడంతో పలువురు మహిళలు శనివారం బ్యాంకును చుట్టుముట్టి అధి
యాడికి, సెప్టెంబరు19: వైఎస్సార్ ఆసరా కింద మంజూరైన నగదు విత్‌డ్రాకు వెళ్లిన మహిళా సంఘాల సభ్యులతో బ్యాంకు అధికారులు నోక్యాష్ అని చెబుతుండడంతో పలువురు మహిళలు శనివారం బ్యాంకును చుట్టుముట్టి అధికా రులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆస రా డబ్బులు ఇవ్వడంలో బ్యాంకు అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నా రు. ఆసరా డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన మహిళలకు నోక్యాష్ అని చెబతున్నార న్నారు.
అయితే ఇతరత్రా లావాదేవీలకు నగదు ఇస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎస్ ఐ మల్లికార్జునరెడ్డి సిబ్బందితో బ్యాంకు వద్దకు చేరుకొని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం బ్యాంకు మేనేజర్ బయటకు వచ్చి వైకేపీ ఏపీఎంతో మాట్లాడుతామని, వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు జమచేస్తామని చెప్పినా మహిళలు పట్టువదలలేదు. దీంతో ఆయన నగదు ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వగలం. తర్వాత మీ ఇష్టం అని తేల్చిచెప్పారు.
Updated Date - 2020-09-20T09:06:29+05:30 IST