వ్యక్తి దారుణ హత్య
ABN, First Publish Date - 2020-11-13T06:19:31+05:30
కదిరి పట్టణంలోని గాంధీనగర్‌లో గురువారం రాత్రి అల్లావుద్దీన్(30) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.
కదిరి, నవంబరు 12: పట్టణంలోని గాంధీనగర్‌లో గురువారం రాత్రి అల్లావుద్దీన్(30) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. మృ తుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు గాంధీనగర్‌లో కాపుర ముంటున్న జాఫర్‌కు నలుగురు కుమార్తెలు. వీరిలో మొదటి కుమార్తెపెళ్లి చేసుకొని వేరే గ్రామంలో కాపురం ఉంటోంది. రెండో కుమార్తెకు వివాహాం చేయగా అమె కూడా తన తండ్రి వద్దే ఉంటోంది. అమె మరిది (భర్త తమ్ముడు) అల్లావుద్దీన్ కూడా బేల్దారి పని చేసు కుంటూ వీరి వద్దే ఉంటున్నాడు. కాగా జాఫర్ చిన్న కుమార్తె పులివెందులకు చెందిన బాబా ప్రేమ వ్యవహారం కారణంగా తరచూ ఇం టికొచ్చేవాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తండ్రి జాఫర్ తమ ఇంటి వ ద్దకు రావద్దని అతన్ని పలుమార్లు వారించారు. అయినా వినకుండా గురువారం రాత్రి తిరిగి బాబా వారి ఇంటికి రావడంతో జాఫర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, అల్లావుద్దీన్ గొడవపడ్డాడు. ఈగొడవలో బాబా తన వద్ద ఉన్న కత్తితో అల్లావుద్దీన్‌ను పొడిచాడు. అ డ్డుగా వచ్చిన మహిళలు, వారి తండ్రి జాఫర్‌పైన దాడికి పాల్పడ్డా డు. ఇరువురు గొడవ పడుతూ వీధిలోని వచ్చారు. అనంతరం వీధిలోని వారు ఇరువురికి సర్ధిచెప్పి ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లి చూడగా కత్తిపోట్లకు గురైన అల్లావుద్దీన్ అక్కడిక్కడే మృతి చెందా డు. విషయాన్ని బాఽధితులు పోలీసులకు తెలిపారు. పట్టణ సీఐ రా మక్రిష్ణ, ఎస్‌ఐ రఫీలు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Updated Date - 2020-11-13T06:19:31+05:30 IST