ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిరోధానికి చర్యలు చేపట్టాలి

ABN, First Publish Date - 2020-04-02T10:43:33+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి శంకరనారాయణ ఆదేశం


అనంతపురం,ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించా రు. ప్రమాద ఘంటికలు మోగుతున్న తరుణంలో ఎలాం టి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల న్నారు. నియోజకవర్గ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఎవరైనా అధిక ధరలకు అమ్మితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన అధికారులతో సమా వేశమయ్యారు. ముం దుగా కోవిడ్‌-19 నివారణపై ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కమిటీతో జిల్లాలో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అ మలు చేయాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో బెడ్లు, బెడ్‌షీట్‌లు, హ్యాండ్‌ శానిటైజర్స్‌ తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పాజిటివ్‌ కేసులు ఎక్కువైతే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల న్నారు. రైతుబజారులు, చౌకదుకాణాల వద్ద భౌతిక దూరా న్ని ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు.


గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని ఇంటి వద్దకే పంపిణీ చేయాలన్నారు. రేషన్‌ డిపోల వద్ద ప్రజలకు అందుబాటులో శానిటైజర్స్‌ ఉంచేలా చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఓను ఆదేశించారు.  జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సమర్థవంతంగా చర్యలు తీసు కుంటున్నామని మంత్రికి కలెక్టర్‌ వివరించారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచడం మూలంగానే పాజిటివ్‌ కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించామన్నారు. వారందరినీ టీటీడీసీ, సీఆర్‌ఐటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచా మన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి బాబురావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో ప్రైమరీ సర్వేలెన్స్‌ టీమ్‌ చక్కగా పనిచేస్తోందన్నారు. ఆ టీమ్‌ సేకరించిన వివరాల్లో ఎవ రైనా విదేశీయులు ఉన్నారా అన్న అంశాన్ని పొందు పరచాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువ మంది రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీ సుకుంటున్నామని మంత్రికి తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఢిల్లీరావు, జేసీ-2 రామ్మూర్తి, డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-02T10:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising