ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉనికిని కాపాడుకునేందుకే జగన్‌పై విమర్శలు

ABN, First Publish Date - 2020-12-13T06:36:08+05:30

రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌పై బురదజల్లుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో 20పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం రూ.1.80కోట్ల నిధులతో భూమిపూజ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి శంకరనారాయణ 

20 పడకల ఆసుపత్రి భవనానికి భూమిపూజ 

రొద్దం, డిసెంబరు 12: రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌పై బురదజల్లుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో 20పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం రూ.1.80కోట్ల నిధులతో భూమిపూజ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉంటే టీడీపీ వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 16మెడికల్‌ కళాశాలలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రొద్దంలో ఎంజేపీ పాఠశాల నిర్మాణం కోసం రూ.15 కోట్ల నిధులతో త్వరలోనే భూమిపూజ చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, రొద్దం వైద్యాధికారి రోహిల్‌కుమార్‌, కన్వీనర్‌ బీ నారాయణరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌, లక్ష్మీనారాయణరెడ్డి, కేపీ శ్రీనివాసులు, కలిపి శ్రీనివాసులు, అమీర్‌బాష, వజీర్‌బాష, ఎంపీహెచ్‌ఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-13T06:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising