ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల తరలింపునకు రంగం సిద్ధం

ABN, First Publish Date - 2020-05-18T10:10:39+05:30

వలస కార్మికుల తర లింపు ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు 1463, రేపు 1514 మందిని తరలించేలా సన్నాహాలు


అనంతపురం రైల్వే, మే 17 : వలస కార్మికుల తర లింపు ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రారంభం కానుంది.   2977 మందిని తరలించేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. అందుకు రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. సోమవారం 1463 మందిని, మంగళవారం మరో 1514 మందిని తరలించేలా ప్రణాళిక రూపొందించారు. సోమ వారం సాయంత్రం 5గంటలకు అనంతపురం స్టేషన్‌ నుంచి శ్రామిక్‌ రైలు బయల్దేరనుంది. ప్రయాణికులు రెం డు గంటలు ముందుగానే స్టేషన్‌కు చేరుకునేలా అధికా రులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్టు  తెలిసింది.


పరీక్షల అనంతరం నిబంధనల ప్రకారం ప్రయాణానికి అనుమతించనున్నారు. సోమవారం అనంతపురం నుంచి బయల్దేరే రైలు గోరఖ్‌పూర్‌ వరకు వెళ్లనుంది. ఉన్నల్‌, జూల, ఉరాయ్‌ స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణించడంతో పాటు అక్కడ ప్రయాణికులు దిగేలా తగిన చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు బయ ల్దేరే రైలు అనంతపురం నుంచి గామ, షాన్‌పూర్‌ మీదుగా బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌కు వెళ్లనుంది. 


నెగిటివ్‌ ఉన్నవారికే ప్రయాణం

కరోనా పరీక్షల్లో  నెగిటివ్‌ వస్తేనే  శ్రామిక్‌ రైళ్లలో ప్ర యాణానికి అనుమతించనున్నారు. శ్రామిక్‌ రైళ్లలో ప్ర యాణించేవారికి ఇప్పటికే అన్ని పరీక్షలు చేశారు. రైల్లో సీటింగ్‌ సామర్థ్యానికి అనుగుణంగానే శ్రామిక్‌ రైళ్లలో  ప్రయాణికులను తరలించనున్నారు.

Updated Date - 2020-05-18T10:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising