ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌ నుంచి బయటికొస్తే చర్యలు : డీఎస్పీ

ABN, First Publish Date - 2020-03-29T11:03:01+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యం లో విదేశాల నుంచి వచ్చిన వారందరూ తమ ఐసొలేషన్‌ హోంల నుంచి 14 రోజుల పాటు బయటకు రాకుండా ఉండాలని డీఎస్పీ వీ రరాఘవరెడ్డి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, మార్చి28 : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యం లో విదేశాల నుంచి వచ్చిన వారందరూ తమ ఐసొలేషన్‌ హోంల నుంచి 14 రోజుల పాటు బయటకు రాకుండా ఉండాలని డీఎస్పీ వీ రరాఘవరెడ్డి హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బ యటకు వస్తే కేసులు నమోదు చేయడంతో పాటు పాస్‌పోర్టులు సీ జ్‌ చేస్తామన్నారు. శనివారం ఆయన తన చాంబర్‌లో సీఐలు కత్తి శ్రీనివాసులు, రెడ్డెప్ప, జాకీర్‌ హూసేన్‌, ప్రతాపరెడ్డిలతో కలిసి విలేక రులతో మాట్లాడారు. నగరంలో విదేశాల నుంచి వచ్చిన 330 మంది ని ఐసొలేషన్‌ హోంలో ఉంచినట్టు తెలిపారు. వారందరిపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ప్రతిరోజు సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నామన్నారు.


అందుకు సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ కిట్‌లను 30 మందికి అందజేసినట్టు తెలిపారు. త్వరలో మరో 1000 కి ట్‌లను కూడా ఎస్పీ అందజేస్తారన్నారు. ఐసోలేసన్‌ హోం అనుమతి లేకుండా బయటకు వస్తే ప్రత్యేక యాప్‌ ద్వారా వారిని గుర్తిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరూ బాధ్యతగా 14 రోజుల పాటు ఐసొలేషన్‌ హోంలకు పరిమితం కావాలన్నారు.  


ఎక్కడికక్కడ పోలీసు నిఘా

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడిక్కడ పోలీసులు నిఘా పెంచడంతో నగరంలోని వీధులు ఖాళీగా దర్శనమిచ్చాయి. లాక్‌డౌన్‌లో భాగంగా శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ నిత్యావసరాల పేరుతో నగరంలోని పాతూరు, సప్తగిరి సర్కిల్‌, రాంనగర్‌, పీటీసీ, ట వర్‌క్లాక్‌, శ్రీకంఠం సర్కిల్‌, రుద్రంపేట తదితర ప్రధాన కూడళ్లు జనాలతో కిటకిట లాడాయి.


డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది రంగ ప్రవేశం చేయడంతో జనాలందరూ మధ్యా హ్నం నుంచి ఇళ్లకు పరిమితమయ్యారు. ఆయా ప్రాంతాలలో గుమికూడిన జనాలను పోలీ సులు తమదైన శైలిలో హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. అనవసరంగా వాహనాలలో బయటకు వచ్చి న వారిపై జరిమానాలు విధించారు. 

Updated Date - 2020-03-29T11:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising