మనోడైతే చాలు!
ABN, First Publish Date - 2020-11-13T06:14:39+05:30
గతంలో అక్రమాలకు పాల్పడి సరెండర్ అయిన వారు, వి వాదాస్పదులు, స్కూళ్లు వదలి ఆఫీసుల్లో పైరవీలు చేసే మహామహులు చాలా మందిని అర్హులుగా ఎంపిక చేసి అందలం ఎక్కించే యత్నాలు సాగుతున్నాయి. సమగ్ర శిక్ష పరిధిలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
అక్రమార్కులైనా అర్హులే !
సరెండర్ అయినోళ్లకూ అవకాశం
వివాదాస్పదులకూ చోటు
7 పోస్టులకు 56 మందితో జాబితా
నేడు ఇంటర్వ్యూలు
అర్హులకు అవకాశమిచ్చేరా..?
అనంతపురం విద్య, నవంబరు 12 : గతంలో అక్రమాలకు పాల్పడి సరెండర్ అయిన వారు, వి వాదాస్పదులు, స్కూళ్లు వదలి ఆఫీసుల్లో పైరవీలు చేసే మహామహులు చాలా మందిని అర్హులుగా ఎంపిక చేసి అందలం ఎక్కించే యత్నాలు సాగుతున్నాయి. సమగ్ర శిక్ష పరిధిలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అయితే అం దుకు అర్హులుగా గుర్తించిన వారిలో చాలా మంది పైరవీలు చేయడంలో సిద్ధహస్తులు కావడం, అక్రమాలకు పాల్పడిన వారికీ చోటు ఇవ్వడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు సెప్టెంబరు లో దరఖాస్తులు ఆహ్వానించారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంఓ), కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ (సీఎంఓ), గర్ల్ చైల్డ్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ (జీసీడీఓ), అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఏఎంఓ- జనరల్), అసిస్టెంట్ ఇం క్లూసివ్ ఎడ్యుకేషన్ కో - ఆర్డినే టర్ (ఏఐఈడీసీఓ), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎ స్‌ఓ), అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ (ఏపీఓ) పోస్టులకు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు, డైట్ అధ్యాపకుల నుంచి దరఖాస్తులు కోరారు. 89 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. కాగా సెక్టోరియల్ ఆఫీసర్(ఎ్‌సఓ) పోస్టులకు 12 మందిని, అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్(ఏఎ్‌సఓ) పోస్టులకు 44 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు జబితాను సమగ్రశిక్ష బ్లాగ్ స్పాట్‌లో ఉంచారు.
అర్హుల జాబితాపై విమర్శలు
అర్హుల జాబితా తయారీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఓ ఎంఈఓ దరఖాస్తు చేసుకోగా అర్హుడిగా గుర్తించారు. ఆయన సమగ్రశిక్షలో ఐఈడీ జిల్లా కో-ఆర్డినేటర్‌గా, ఇన్‌చార్జ్ ఎఫ్‌ఏఓగా పనిచేశారు. ఐఈడీ టీచర్ల నుంచి రూ.లక్షల వసూళ్లకు పాల్పడ్డాడు. దీంతో అప్పటి ఎస్పీడీ సరెండర్ చేశారు. దీంతో ఆయనను సమగ్ర శిక్ష నుంచి రిలీవ్ చేశారు. ఇప్పుడు ఆయనను సైతం అర్హుడిగా ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. మరికొందరు టీచర్లు స్కూళ్లలో కనిపించిన దాఖలాలు లేవు.
ఎప్పుడు చూసినా స్కూళ్లలో వివాదాలకు దిగడం, డెప్యుటేషన్‌పై, పైరవీలతో కాలం వెల్లబుచ్చే మరికొందరిని అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు అర్హులుగా గుర్తించడం విమర్శలకు తావిస్తోంది. కాగా దరఖాస్తు చేసిన వారిలో ఒకే సామాజిక వర్గం వారు అధికంగా ఉ న్నారు. ఇదంతా రింగ్ అయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మకంగా సమగ్ర శిక్షలో పనిచేసే ఓ సంఘం నాయకుడు తన ప్రాబల్యం పెంచుకోడానికి తన సామాజికవర్గం వారినే అధికంగా రంగంలోకి దింపాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంపై సమగ్ర శిక్షలో కుల రాజకీయాలు, పైరవీలు అధికమయ్యాయన్న వాదనలు వచ్చిన దరఖాస్తులు, అర్హుల జాబితాలో అక్రమార్కులకు చోటివ్వడమే స్పష్టం చేస్తోంది.
Updated Date - 2020-11-13T06:14:39+05:30 IST