ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోరుమంటున్న మార్కెట్‌యార్డులు

ABN, First Publish Date - 2020-05-09T09:38:27+05:30

కరోనా నేప థ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో మార్కెట్‌యార్డులు భారీగా ఆదాయాన్ని కోల్పోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌తో స్తంభించిన కార్యకలాపాలు

గతేడాదితో పోల్చితే రూ. 3 కోట్ల ఆదాయానికి గండి 

రాయదుర్గం యార్డుకు మాత్రమే అధిక ఆదాయం 


అనంతపురం, మే 7 (ఆంధ్రజ్యోతి) : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో మార్కెట్‌యార్డులు భారీగా ఆదాయాన్ని కోల్పోయాయి. పశువుల సంతలు, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మార్కెట్‌ యార్డులకు పన్నుల రూపంలో భారీగా ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ వల్ల గతేడాది తో పోలిస్తే ఈఏడాది దాదాపు రూ. 3 కోట్ల వరకూ యా ర్డులు ఆదాయాన్ని కోల్పోయాయి. కొన్ని యార్డుల్లో మా త్రమే కొంత ఆదాయం సమకూరింది. జిల్లాలో 17 యార్డు లుండగా కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలో ఇప్పటి వరకూ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. మిగిలిన అనంతపు రం, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, మడకశిర, తాడిపత్రి, తనకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, కదిరి, పెనుకొండ, హిందూపురంయార్డులే ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. వీటితో పాటు చెక్‌పోస్టుల ద్వారా ప్ర తినెలా దాదాపు రూ. 2 కోట్ల వరకూ వచ్చే ఆదాయానికి కూడా గండిపడింది. యార్డుల వారీగా పరిశీలిస్తే అనంత పురం మార్కెట్‌ యార్డుకు రూ. 30 లక్షల ఆదాయం తగ్గి పోయింది. ప్రతి శని, ఆదివారాల్లో పశువులు, గొర్రెలు, మే కల సంతల నిర్వహణతో పాటు ఒక్క శాతం యూజర్‌ చార్జీలు వసూలు చేసేవారు.


ప్రస్తుతం ఆ ఆదాయాన్నం తా కోల్పోవాల్సి వచ్చింది. హిందూపురం మార్కెట్‌లో చిం తపండు, మిర్చి కొనుగోలు పూర్తిస్థాయిలో నిలిచిపోవడం తో దాదాపు రూ. 1.5 కోట్ల వరకూ ఆదాయం తగ్గింది. క ళ్యాణదుర్గంలో అరకొరగా చింతపండు విక్రయాలు జరి గినప్పటికీ రూ. 75 లక్షలు, తాడిపత్రి మార్కెట్‌ యార్డులో రూ. 6 లక్షలు, గుంతకల్లు మార్కెట్‌ యార్డులో రూ. 9 లక్షలు, ధర్మవరంలో రూ. 4 లక్షలు ఆదాయం తగ్గింది. మిగిలిన యార్డుల్లో రూ. 16 లక్షల దాకా ఆదాయానికి గం డి పడింది. రాయదుర్గం మార్కెట్‌ యార్డులో మాత్రమే రూ. 2.25 లక్షలు అదనపు ఆదాయం సమకూరింది. గతే డాది ఇదే సమయానికి రూ. 15.28 లక్షలు ఆదాయం ఉం డగా ఈ ఏడాది రూ. 17.53 లక్షలు వసూలైంది. కర్ణాటక నుంచి ఈ యార్డుకు అల్లంతో పాటు స్థానికంగా పండిన వరి, మిర్చి రావడంతో ఈ ఆదాయం సమకూరింది. 


దళారుల ఆదాయానికి గండి

జిల్లాలోని కొత్తగా ఏర్పడిన మార్కెట్‌ యార్డులు మిన హా మిగిలిన మార్కెట్‌ యార్డుల్లో దళారుల దందా కొనసా గుతున్న విషయం తెలిసిందే. పశువుల సంతలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల్లోనూ వీరి పాత్ర గణనీయంగా ఉంటుంది. కొనుగోలుదారులు, అమ్మకందా రుల నుంచి కమీషన్‌ రూపంలో కాసులు దండుకోవడమే ఈ దళారుల పని. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో మార్కెట్‌ యార్డుల్లో పూర్తి స్థాయిలో క్రయవిక్రయాలతో పాటు పశువుల సం తలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో దళారులకు  పని లేకుండా పోయింది. నెలలో ఒక్కో దళారీ దాదాపు రూ. 2 లక్షల వరకూ కమీషన్‌ రూపంలోనే సంపాదిస్తున్నట్లు యార్డు వర్గాల  సమాచారం. 

Updated Date - 2020-05-09T09:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising