ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురజాడ ఆశయాలను కొనసాగిద్దాం : ఐద్వా

ABN, First Publish Date - 2020-09-22T07:53:18+05:30

కవి గురజాడ అప్పారావు ఆశయాలను కొనసాగిద్దామని ఐద్వా రాష్ట్ర నేత సావిత్రి పేర్కొన్నారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం టౌన్‌, సెప్టెంబరు 21: కవి గురజాడ అప్పారావు ఆశయాలను కొనసాగిద్దామని ఐద్వా రాష్ట్ర నేత సావిత్రి పేర్కొన్నారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సా విత్రి మాట్లాడుతూ వ్యవహారిక భాష, సంఘ సంస్కరణ ఉద్యమాలకు, ప్రగతిశీల భావాలకు స్ఫూర్తిదాయకుడు గు రజాడ అని కొనియాడారు.


మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు తన రచనలతో పరిష్కారం చూపారన్నారు. ఆయన చూపిన మార్గంలో నవసమాజాన్ని నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక, మెడికల్‌ రెప్రజెంటివ్‌ల యూనియన్‌ నేతలు శ్రీనివాసరావు, మాలిన్‌బీ, ఓబుళమ్మ, శోభ, లత, సునంద, భాగ్య, అనసూయమ్మ పాల్గొన్నారు.


అనంతపురం క్లాక్‌టవర్‌: మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు అని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి పేర్కొన్నారు. గురుజాడ జయంతిని సీపీఐ స్థానిక కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.


కార్యక్రమంలో నేతలు వరలక్ష్మి, జయలక్ష్మి, పార్వతి, లక్ష్మీదేవి, నాగమణి, గౌరమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2020-09-22T07:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising