ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూడాల నిరసన బాట

ABN, First Publish Date - 2020-08-10T08:41:26+05:30

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూ నియర్‌ వైద్యులు నిరసన బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు రోజులుగా నల్ల బాడ్జీలు ధరించి విధులు చేపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమ డిమాండ్లు పరిష్కరించాలి.. లేదంటే కరోనా 

సేవలు నిలిపేస్తాం.. జూడా సంఘం నేతల హెచ్చరిక


అనంతపురం వైద్యం అగస్టు9:  ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూ నియర్‌ వైద్యులు నిరసన బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు రోజులుగా నల్ల బాడ్జీలు ధరించి విధులు చేపడుతున్నారు. ఆదివారం రాత్రి జిల్లా ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద కొవ్వొత్తులు, ప్లకార్డ్‌లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూడాల సంఘం నాయకు లు మాట్లాడుతూ గత మార్చి నుంచి కరోనా సేవల్లో నిర్విరామంగా ప ని చేస్తువస్తున్నా, తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పం దన లేదన్నారు. కేంద్రం కరోనా డాక్టర్‌లకు రూ50 లక్షలు బీమా ప్రకటించిందని, కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయ న్నారు.


డాక్టర్ల్‌ కొరత వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, కొంతమంది కరోనా బారిన పడుతున్నామన్నారు. నాన్యతలేని పీపీఈ కిట్లు, ఎన్‌95 మా స్కులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ ప్రకారం గౌరవ వేతనం ఈ  జనవరి నుంచి పెంచలేదని, కరోనా డ్యూటీలకు ప్రత్యేక గౌరవ వేతనం ఇవ్వలేదన్నారు. ఇలాగే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే కరోనా సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూడాల నా యకులు అనిల్‌, తరుణ్‌, వినిల్‌, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T08:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising