ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బైక్‌ ర్యాలీపై ఆంక్షలు

ABN, First Publish Date - 2020-11-25T06:47:06+05:30

టీ డీపీ బైక్‌ ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధిం చి, అడ్డుకున్నారు.

జేసీ పవన్‌ను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ పవన్‌ అరెస్టు

తమ్ముళ్ల ఆగ్రహం.. ఉద్రిక్తత..

అనంతపురం వైద్యం, నవంబరు 24: టీ డీపీ బైక్‌ ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధిం చి, అడ్డుకున్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న వరుస దాడులను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు మంగళవారం అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించాలని పూనుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు బైక్‌లతో జేసీ పవన్‌ నివాసమున్న గుల్జార్‌ పేటకు చేరుకున్నాయి. జేసీ పవన్‌ కూడా బైక్‌లో అక్కడికొచ్చారు. పోలీసులు పెద్దఎత్తున గుల్జార్‌పేటలోని జేసీ నివాసం వద్దకు చేరుకున్నారు. బైక్‌ ర్యాలీకి అనుమతి లేదని ఆంక్షలు పెట్టారు. అయినా తెలుగు తమ్ముళ్లు నిరసన ర్యాలీ సాగిస్తామని ముందుకు సాగడానికి ప్రయత్నం చేశారు. దీంతో జేసీ పవన్‌రెడ్డిని పోలీసులు అ రెస్టు చేశారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు.. పోలీసుల తీరును తప్పుబడుతూ పవన్‌ అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అరగంటపాటు ఆ ప్రాంతంలో తమ్ముళ్ల నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్‌ను టూటౌన్‌ పో లీ్‌సస్టేషన్‌కు తరలించారు. కార్యకర్తలు అక్కడికీ వె ళ్లారు. చివరకు సొంత పూచీకత్తుపై పవన్‌ను విడుదల చేశారు. దీంతో తమ్ముళ్లు శాంతించారు. పోలీసుల తీరును పవన్‌ తప్పుబట్టారు.


పవన్‌ అరెస్టు అన్యాయం: కాలవ

జేసీ పవన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం అన్యాయ మని టీడీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అఽధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అరెస్టు విషయం తెలిసిన వెంటనే ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై శాంతియుత నిరసన చేపడుతుంటే పోలీసులు అడ్డుకోవటం దుర్మార్గమన్నారు.


డీఎం యాక్ట్‌ అతిక్రమించటంతో జేసీ పవన్‌ అరెస్టు: డీఎస్పీ

అనంతపురం క్రైం: నగరంలో డీఎం (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) యాక్ట్‌ అతిక్రమించడంతోనే జేసీ పవన్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వీరరాఘవరెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోకుండా జేసీ పవన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి నగరంలో బైక్‌ ర్యాలీ చేయాలనే ప్రయత్నం చేశారన్నారు. తనకు దరఖాస్తు చేసుకున్నా.. జిల్లా కలెక్టర్‌ అనుమతి తీసుకోమని సూచించామన్నారు. అనుమతి లేకుండా ర్యాలీకి ప్రయత్నించటంతోనే జేసీ పవన్‌రెడ్డితో పాటు మరో 14 మందిని అరెస్టు చేశామన్నారు.

Updated Date - 2020-11-25T06:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising