ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాష్ట్రంలో ఎక్కడైనా పింఛన్‌’ ఉత్తర్వుల జారీ

ABN, First Publish Date - 2020-03-31T11:44:52+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పింఛ న్ల పంపిణీలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వ్యవసాయం, మార్చి 30: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పింఛ న్ల పంపిణీలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా పింఛన్‌ తీసుకునే అవకాశం కల్పించింది. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విష యం తెలిసిందే. దీంతో పలురకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ జిల్లా కేంద్రంతోపాటు పలు పట్టణాల్లోని ఆస్పత్రులకు వైద్య చికిత్సల కో సం వచ్చిన పింఛన్‌దారులు, బంధువుల ఇళ్లకు వచ్చినవారు ఎక్కడికక్క డే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.


రెగ్యులర్‌ చెక్‌పల కోసం వచ్చిన కొంతమంది అయితే బంధువుల ఇళ్ల వద్దనే ఉండిపోయారు. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో పింఛన్‌దారులుంటే అక్కడే పింఛన్‌ తీసుకునే సదుపాయం కల్పించారు. జిల్లాలో ఉండిపోయిన ఇతర జిల్లాల పింఛన్‌దారులకు కూడా ఇక్కడే పింఛన్‌ సొమ్ము అందజేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇతర జి ల్లాల్లో ఉంటున్న అనంతకు చెందిన పింఛన్‌దారులు కూడా అక్కడే పిం ఛన్‌ సొమ్ము తీసుకోవచ్చన్నారు.


స్థానిక గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫే ర్‌ అసిస్టెంటును సంప్రదిస్తే స్థానిక వలంటీర్‌ ద్వారా పింఛన్‌ అందించేలా చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాకు ఏప్రిల్‌ నెలకు సంబంధించి 5,10,972 మంది పింఛన్‌దారులకు రూ.123.78 కోట్ల సొమ్ము కేటాయించారన్నారు. ఇప్పటివరకు 60 శాతం సొమ్ము డ్రా చేశారన్నారు. మిగిలిన డబ్బు మంగళవారం డ్రా చేస్తారన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వేలిముద్ర లేకుండా పింఛన్‌ సొమ్ము అందజేయనున్నామన్నారు.

Updated Date - 2020-03-31T11:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising