ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి దీపానికి రాజకీయ గ్రహణం

ABN, First Publish Date - 2020-11-13T06:10:45+05:30

రాజకీయ నాయకుల జోక్యంతో ఇళ్ల నిర్మా ణం పూర్తైనా విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని కొంతమంది విద్యుత్‌ అధికారులు ఆ నాయకుల ఆగడాలకు వంత పాడుతుండ టం వినియోగదారులకు శాపంగా మారింది. ఈవిషయం సంబంధిత ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ కనెక్షన్ల జారీలో రాజకీయం !

ఇళ్ల నిర్మాణం పూర్తయినా కనెక్షన్లు ఇవ్వని అధికారులు

నెలల తరబడి తప్పని ఎదురుచూపులు

ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం


అనంతపురంరూరల్‌,నవంబరు 12: రాజకీయ నాయకుల జోక్యంతో ఇళ్ల నిర్మా ణం పూర్తైనా విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.  క్షేత్ర స్థాయిలోని కొంతమంది విద్యుత్‌ అధికారులు ఆ నాయకుల ఆగడాలకు వంత పాడుతుండ టం వినియోగదారులకు శాపంగా మారింది. ఈవిషయం సంబంధిత ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో నెలల తరబడి వినియోగదారులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 


తప్పని ఎదురుచూపులు


మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన కొంత మంది గ్రామ సమీపంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇం దులో దాదాపు 40 మంది తమ ఇళ్ల నిర్మాణం పూర్తవటంతో విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో దరఖాస్తు చేసుకున్నారు. కనెక్షన్ల కోసం సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా కనెక్షన్లు మా త్రం మంజూరు కాలేదు. స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలి. కానీ ఇక్కడ నెలలు గడిచినా అలా జరగలేదు. స్థానికంగా ఇళ్ల నిర్మాణాలు చేసిన భూమి వారిది కాదని, ప్రభుత్వ భూమంటూ అధికార పార్టీకి చెందిన నాయకులు ఆ స్థలంలో ఇళ్ల పట్టాల మంజూరుకు చాలా రోజులుగా పట్టుపట్టారు. ఈక్రమంలోనే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అంతటితో ఆగకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది ప్రభు త్వ స్థలమని ఇంటి నిర్మాణాలకు మొదటి నుంచి అడ్డుపడుతూనే వచ్చారు. అ యితే స్థానికంగా ఇళ్లు నిర్మించుకున్న వారు అది ప్రభుత్వ భూమి కాదని తాము కొన్నేళ్ల కిందటే రిజిస్టర్‌ చేయించుకున్నామని కోర్టును ఆశ్రయించారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలిసింది. ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిని ఇబ్బంది పెట్టోద్దని రెవెన్యూ అధికారులు సూచించారు. ఈ విషయంలో ఏమిచేయలేని స్థానిక నాయకులు ప్రస్తుతం విద్యుత్‌ కనెక్షన్ల జారీకి అడ్డంకులు సృష్టిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


రాజకీయ నాయకులకు వంత పాడుతున్న అధికారులు


రాజకీయ నాయకుల ఆగడాలకు క్షేత్రస్థాయిలోని విద్యుత్‌ అధికారులు తాళమేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం వారికి సంబంధించిన అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు.  అయితే అధికారులు మాత్రం వినియోగదారులు ఇళ్లు నిర్మించుకున్న స్థలాలకు రిజిస్టర్‌ పత్రా లు లేవంటూ కనెక్షన్లు జారీ చేయకుండా జాప్యం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఎలాంటి పత్రాలు లేకుండానే ఇల్లు నిర్మించుకుని విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే కనెక్షన్‌ మం జూరు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం విద్యుత్‌ కనెక్షన్‌ కో సం అన్ని అర్హతలున్నా కనెక్షన్‌లు మంజూరు చేయటం లేదు.  


మూడు నెలల కిందట దరఖాస్తు చేశాం


విద్యుత్‌ కనెక్షన్‌ కోసం మూడు నెలల కిందట దరఖాస్తు చేసుకున్నాం. అయినా విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. విద్యుత్‌ సరఫ రా లేకపోవడంతో రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. విషసర్పాలు సంచరిస్తున్నాయి. ఇటీవల నేనే తేలు కాటుకు గురయ్యా. అధికారులు మా ఇబ్బందులను గుర్తించి విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలి.  


- లక్ష్మీదేవి, స్థానికురాలు


సమస్య మా దృష్టికి వచ్చింది 


విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని కొంత మంది వినియోగదారులు కార్యాలయానికి వచ్చారు. స్థానిక ఏఈఈకి కనెక్షన్లు ఇవ్వాలని సూచించాం. అయితే వినియోగదారుల స్థలాలకు సంబంధించి పట్టాలు కానీ ఇతర పత్రాలు లేవని తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించి వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.


- సురేంద్ర, ఈఈ, అనంతపురం డివిజన్‌

Updated Date - 2020-11-13T06:10:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising