ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిని తరలిస్తే వైసీపీకి పుట్టగతులుండవ్

ABN, First Publish Date - 2020-08-12T08:41:42+05:30

రాజధాని అమరావతిని తరలిస్తే వైసీపీకి పుట్టగతులుండవని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు జో ష్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‌టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి 

ఉమామహేశ్వర్‌నాయుడు


కళ్యాణదుర్గం, ఆగస్టు 11:  రాజధాని అమరావతిని తరలిస్తే వైసీపీకి పుట్టగతులుండవని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు జో ష్యం చెప్పారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు దొడగట్ట నారాయణ, బిక్కి గోవిందప్ప, మాదినేని మురళి, శ్రీరాములు, రామరాజు, సత్యప్పలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాం తాల్లో చేసిన అభివృద్ధిపై ఆ పార్టీ జాతీయ అ ధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారన్నారు. వైసీపీ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసి సవాల్‌కు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.


ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అన్న అంశంపై కట్టుబడి ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయంతో ప్రాంతాల మధ్య చిచ్చురేపితే సమైఖ్యాంధ్ర తరహాలో ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసిన పాపానికి కాంగ్రెస్‌ అథోగతి పాలయిందని విమర్శించారు. సమావేశంలో నాయకులు నాగరాజు, పాలవాయి రాము, రోషన్‌ తదితరులు పాల్గొన్నారు.  


మృతుడి కటుంబానికి అండగా నిలుస్తాం 

కళ్యాణదుర్గం: టీడీపీ సీనియర్‌ నాయకుడు కోనాపురం ధనుంజయ కుటుంబానికి అండగా నిలుస్తామని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు భరోసా ఇచ్చారు.  బెళుగుప్ప మండలం కోనాపురం గ్రామానికి చెందిన ధనుంజయ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కళ్యాణదుర్గం పట్టణం లో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన కోనాపురం గ్రామానికి వెళ్లి ధనుంజ య మృతదేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సా నుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ధనుంజ య మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-12T08:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising