ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

ABN, First Publish Date - 2020-02-20T09:30:53+05:30

భార్యను చంపిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ జిల్లా మహిళా కోర్టు జడ్జి సునీత బుధవారం తీర్పునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 19 : భార్యను చంపిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ జిల్లా మహిళా కోర్టు జడ్జి సునీత బుధవారం తీర్పునిచ్చారు. పోలీసులు తెలి పిన మేరకు.. బెళుగుప్ప మండలానికి చెందిన రాజప్పకు 2013లో రాయదుర్గం మండలంలోని కెంచనపల్లికి చెందిన యువతితో వివాహమైంది. రెండేళ్ల పాటు దంపతులు సంతోషంగా జీవించారు. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. తదనంతరం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో 2015 అక్టోబరు 28న భార్య కుమారుడితో కలిసి అత్తారింటికి వెళ్లారు. అదేరోజు తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యపై రాజప్ప కత్తితో దాడి చేసి హత్య చేశా డు. అడ్డుగా ఉన్న కుమారుడిపై కూడా దాడి చేసి పరార య్యాడు. దీంతో అప్పటి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తాజాగా జిల్లా మహిళా కోర్టు జడ్జి సునీత నిందితుడు  రాజప్పకు జీవితఖైదు విదిస్తూ తీర్పును వెలువరించారు. నిందితు డికి శిక్ష పడేలా కేసును వాదించిన న్యాయవాది శ్రీదేవి, పోలీసులకు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు అభినందనలు తెలియజేశారు.  

Updated Date - 2020-02-20T09:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising