ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెంగీ విజృంభణ

ABN, First Publish Date - 2020-02-20T09:32:53+05:30

మండలంలో డెంగీ విజృంభిస్తోంది. దీంతో రోగులు వైద్యం కోసం పరు గులు తీస్తున్నారు. మండలంలోని గోవిందపల్లి గ్రామంలో దాదాపు 30 మందికి పైగా డెంగీ బారిన పడి చికిత్స పొం దుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోవిందపల్లిలో 30కిపైగా  కేసులు 


బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 19 :  మండలంలో  డెంగీ విజృంభిస్తోంది. దీంతో రోగులు వైద్యం కోసం పరు గులు తీస్తున్నారు. మండలంలోని గోవిందపల్లి గ్రామంలో  దాదాపు 30 మందికి పైగా డెంగీ బారిన పడి చికిత్స పొం దుతున్నారు. ఆ గ్రామంలో డెంగీనే కాకుండానే మలేరి యా విషజ్వరాలు తీవ్రంగా ఉన్నాయి. డెంగీ జ్వరం వచ్చి న బాధితులు అనంతపురంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. గోవిందపల్లి, బుక్కరాయసము ద్రం, రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో డెంగీ కేసులు నమోదయ్యా యి. గోవిందపల్లి గ్రామానికి చెందిన నాగేంద్రరెడ్డి, శంకర్‌, గోపాల్‌రెడ్డి, జస్వంత్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డి, నాగేంద్రమ్మ, సువర్ణ, శాంతి, ధనమ్మ, అనిల్‌కుమార్‌, సాయి, భవాని, పెద్దక్కతో పాటు మరోపది మందికి పైగా డెంగీ వ్యాధి బారిన పడ్డారు. 

గ్రామాల్లో దోమల దండయాత్ర 

గ్రామాల్లో పారిశుధ్యం ఆధ్వానంగా మారడంతో ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో రోగాలు విరుచుకుపడుతున్నాయి. గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు లేక, ప్రత్యేకధికారులు పాలనను పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి.

Updated Date - 2020-02-20T09:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising