ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోర్జరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌

ABN, First Publish Date - 2020-09-27T08:13:28+05:30

నగరంలోని ఓ స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, విక్రయించేందుకు సిద్ధపడిన ముగ్గురు నిందితులను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, సెప్టెంబరు: నగరంలోని ఓ స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, విక్రయించేందుకు సిద్ధపడిన ముగ్గురు నిందితులను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని నవోదయ కాలనీకి చెందిన ఎద్దుల రాజేష్‌, షాదిక్‌వలి, ఇర్ఫాన్‌ కలిసి నాయక్‌నగర్‌ సెవెన్‌హిల్స్‌ కాలనీలోని 8సెంట్ల స్థలంపై కన్నేశారు. 2019లో దానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ స్థలం పుట్టపర్తిలోని రాజేశ్వరి అనే మహిళకు చెందినది.


రాజేశ్వరి భర్త పేరు మల్లికార్జున కావటంతో అదే పేరు కలిగిన తలుపుల మండలానికి చెందిన నకిలీ మల్లికార్జున ద్వారా ఆ స్థలంలోని 4 సెంట్లను ఇర్ఫాన్‌ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. తర్వాత ఆ స్థలాన్ని నగరానికి చెందిన లీలావతి అనే మహిళకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఆమె నేరుగా ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌లోని ఆధార్‌ వివరాల ఆధారంగా పుట్టపర్తిలోని రాజేశ్వరిని కలిసింది. అసలు విషయం బయటపడటంతో బాధిత మహిళ అప్పట్లో టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా శనివారం నగర శివారులో ఎద్దుల రాజేష్‌, ఇర్ఫాన్‌, షాదిక్‌వలీని అరెస్ట్‌ చేశారు. కోర్టు అదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు మల్లికార్జున పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-27T08:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising