ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గంలో ఫ్లెక్సీ వివాదం

ABN, First Publish Date - 2020-10-25T09:33:52+05:30

మాజీ మంత్రి, టీ డీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం స్థానికంగా అభిమానులు ఏర్పాటు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం టౌన్‌, అక్టోబరు 24: మాజీ మంత్రి, టీ డీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం స్థానికంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. కణేకల్లు రోడ్డులోని చికెన్‌ వ్యాపారి ఇబ్రహీమ్‌ దుకాణం వద్ద 13వ వార్డు టీడీపీ అభ్యర్థి నాగరాజు ఈఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.


అయితే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర, మున్సిపల్‌ మేస్త్రీ మంజు చికెన్‌ దుకాణం వద్దకు వెళ్లి ఫ్లెక్సీపై ఆరాతీశారు. రేపటి నుంచి చికెన్‌ కొట్టు తెరిస్తే సరుకంతా ఎత్తుకెళతామని చికెన్‌ వ్యాపారిని హెచ్చరించారు. దీంతో ఆయన మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు కడ్డిపూడి మహబూబ్‌ బాషా దృష్టికి తీసుకువచ్చారు. మైనార్టీ కమిటీ నాయకులతో కలసి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటును జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకుల మెప్పుపొందేందుకే అధికారులు ఇలా వ్యవహరించారన్నారు. చికెన్‌ షాపు నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Updated Date - 2020-10-25T09:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising