ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరూ బాధ్యతగా పనిచేయాలి

ABN, First Publish Date - 2020-08-12T08:26:49+05:30

జిల్లాకేంద్రంలోని సర్వజనాస్పత్రిలో అవసరమైన వసతులు, వైద్యులు ఉన్నా.. సరైన సేవలు అందట్లేదన్న విమర్శలు వస్తుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యవసర పడకలు పెంచాలి..

మరో 120 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేయాలి.. అనంత

సర్వజనాస్పత్రి వైద్యులకు

జేసీ నిషాంత్‌ కుమార్‌ ఆదేశం


అనంతపురం వైద్యం, ఆగస్టు11: జిల్లాకేంద్రంలోని సర్వజనాస్పత్రిలో అవసరమైన వసతులు, వైద్యులు ఉన్నా.. సరైన సేవలు అందట్లేదన్న విమర్శలు వస్తుండటం బాధాకరమనీ, ఈ అపవాదాను తొలగించుకోవాలనంటే అందరూ బాధ్యతగా పని చేయాలని జేసీ నిషాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతో కలిసి మంగళవారం ఆయన సర్వజనాస్పత్రిని తనిఖీ చేశారు. కొవిడ్‌ విభాగాలను పరిశీలించారు. అందులో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శిస్తూ..


వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలను ఆరాతీశారు. వసతులు, సేవలపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామినాయక్‌ను అడిగి, తెలుసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఆస్పత్రిలో అవసరమైన వసతులు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రయాజింగ్‌ సెంటర్‌లో అత్యవసర పడకలను పెంచాలని ఆదేశించారు. మరో 120 ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేయలన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేసేందుకు ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రిలో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచాలనీ, సెక్యూరిటీని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో పలు విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.


జేసీ నిశాంత్‌కుమార్‌ విధులకు హాజరు

అనంతపురం,ఆగస్టు11(ఆంధ్రజ్యోతి) : జాయింట్‌ కలెక్టర్‌ ని శాంత్‌ కుమార్‌ మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆయన రెండు వారాల క్రితం కరోనా బారిన పడిన విషయం విదితమే. దీంతో హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన మంగళవారం యఽథావిధిగా విధులకు హాజరయ్యారు. తొలిరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. 

Updated Date - 2020-08-12T08:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising