ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంట్ బిల్లు రూ. 1.49 లక్షలు రావడంతో కూలీ మహిళ షాక్

ABN, First Publish Date - 2020-12-19T06:46:03+05:30

ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు కురుబ కామాక్షమ్మ. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో నివాస ముంటోంది

కామాక్షమ్మ , రూ.1,49,034 వచ్చిన కరెంటు బిల్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కణేకల్లు, డిసెంబరు 18 : ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు కురుబ కామాక్షమ్మ. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో నివాస ముంటోంది. కూలీనాలీ చేసుకొని జీవనం సాగిస్తున్న ఈమెకు, విద్యుత్‌ అధికారులు కరెంటు బిల్లు రూపంలో షాకిచ్చారు. డిసెంబరు నెల కరెంటు బిల్లు ఏకంగా రూ.1,49,034 జారీ చేశారు. ప్రతి నెలా కేవలం రూ.వంద దా టని బిల్లు.. ఉన్నఫలంగా రూ.లక్ష దాటిస్తూ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి ఖంగుతింది. తాను జీవితాంతం చెల్లించినా ఇంత కరెంటు బిల్లు రా దని, కేవలం ఒక నెలకు మాత్రమే ఇంత పెద్దమొత్తంలో  బిల్లు వేశారని వి స్మయానికి గురైంది. కూలీనాలీ పనులు చేసుకుని జీవించే కామాక్షమ్మకు ఇంత పెద్దమొత్తంలో కరెంటు బిల్లు రావడంతో ఎలా చెల్లించాలో తెలియక విద్యుత్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఈ విషయంపై స్థానిక ఇన్‌చార్జి విద్యుత్‌ ఏఈ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా, సాంకేతిక సమస్య కారణంగానే ఇలాంటి తప్పిదం చోటు చేసుకుందని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె వినియోగించిన యూనిట్ల మేరకే విద్యుత్‌ బిల్లు వ చ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా మండల వ్యాప్తంగా పలువురు వినియోగదారులు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. 



Updated Date - 2020-12-19T06:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising