ఎన్నికల సెల్‌పై కలెక్టర్ ఆగ్రహం
ABN, First Publish Date - 2020-03-16T10:26:42+05:30
ఎన్నికల సెల్‌పై కలెక్టర్ ఆగ్రహం
ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా?
ముగ్గురిపై తీవ్రంగా మండిపాటు
ఇద్దరికి షోకాజ్ నోటీసులు..?
అర్ధరాత్రి బ్యాలెట్ పత్రాల ముద్రణ తనిఖీ
అనంతపురం విద్య, మార్చి 15: ఎన్నికల సెల్ అధికారులపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి ఆయన జిల్లా పరిషత్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణలతో పాటు బీఫామ్స్ స్వీకరించారు. అయితే అధికారులు అభ్యర్థుల తుది జాబితా వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలో జడ్పీలోని ఎన్నికల సెల్ అధికారులు అస్పష్టమైన గణాంకాలు చెప్పడంతోపాటు..పొంతనలేని నివేదికలు ఇవ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏమిటి? ఎన్నికల సమయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా’ అని మండిపడ్డారు. కనీసం నామినేషన్లు ఎంతమంది వేశారు.. ఎంతమందివిత్‌డ్రా చేశారనే సమాచారం కూడా సరిగా తెప్పించలేకపోతే ఎలాగంటూ ఒక ఏఓ, సీనియర్ అసిస్టెంటుతోపాటు మరో అధికారిపై ఆయన మండిపడ్డారు. ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
అర్ధరాత్రి తరువాత కూడా..
అర్ధరాత్రి తరువాత కలెక్టర్ గంధం చంద్రుడు సాయినగర్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో జరుగుతున్న బ్యాలెట్ పత్రాల ముద్రణను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే గుత్తి రోడ్డులోని మరో ప్రింటింగ్ ప్రెస్‌లో జరుగుతున్న బ్యాలెట్ పత్రాల ముద్రణను జేసీ ఢిల్లీ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Updated Date - 2020-03-16T10:26:42+05:30 IST