ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాధుల పక్కన ఇళ్లు కట్టుకోలేం..

ABN, First Publish Date - 2020-12-30T06:37:47+05:30

పట్టాల పంపిణీలో మంగళవారం అధికారులకు, వైసీపీ నాయకులకు చుక్కెదురైంది. సమాధుల పక్కన ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలంటూ లబ్ధిదారులు ఇంటిపట్టాలను తీసుకోక పోవడంతో అధికారులు వెను తిరిగారు.

పెనుకొండలో ధర్నా చేస్తున్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి పట్టాలను తిరస్కరించిన లబ్ధిదారులు

- వెనుతిరిగిన అధికారులు



ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం అధికారులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. స్థలం, లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని ప్రజల నుంచి ని రసనలు వ్యక్తం అవుతున్నాయి. గాండ్లపెంట మండలంలో శ్మశానం పక్కన లేఔట్‌ వేశారని అక్కడ ఇళ్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు పట్టాలు తీసుకోవ డానికి నిరాకరించారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. కొత్తచెరువు మండలంలో జాబితాలో పేరుండి పంపిణీ రోజు కనిపించకపోవడం ఎమిటని వైసీపీ నాయకుడితో లబ్ధిదారుడు వాగ్వాదానికి దిగాడు. అనంతరం వారి మధ్య జరిగిన ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. పెనుకొండ మండలంలో అర్హులకు ఇంటిపట్టాలు అందలేదని ధర్నాకు దిగారు. అలాగే కొత్తచెరువు మండలంలో అనర్హులకు ఇంటిప ట్టాలిచ్చారని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారికి అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 


గాండ్లపెంట,  డిసెంబరు 29 : పట్టాల పంపిణీలో మంగళవారం అధికారులకు, వైసీపీ నాయకులకు చుక్కెదురైంది. సమాధుల పక్కన ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలంటూ లబ్ధిదారులు ఇంటిపట్టాలను తీసుకోక పోవడంతో అధికారులు వెను తిరిగారు. మండలంలోని సోమయాజులపల్లి గ్రామంలో 19 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయగా, సోమయాజులపల్లి, కత్తివారిపల్లి గ్రామాల మధ్యన వేసిన లేఔట్‌ పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే గ్రామస్థులు మాత్రం గ్రామంలోనే ఉండి గ్రామానికి ఉన్న శ్మశాన వాటికను ఆనుకుని వంక వద్ద పట్టాలు ఇస్తే తమకు వద్దని, ఈ పట్టాలు పంపిణీతో గ్రామాన్ని విడదీసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వలంటీర్లు, వైసీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్ళ వద్దకు వెళ్ళి పట్టాలు తీసుకోవాలని వేడుకున్నా.. లబ్ధిదారులు ససేమిరా ఒప్పుకోలేదు. సమాధుల పక్కన తాము ఇళ్లు కట్టలేమని, తమకు పట్టాలు వద్దని తేల్చి చెప్పడంతో అధికారులు, వైసీపీ నాయకులు వేరే దారి లేక వెనుతిరిగి వెళ్ళారు.


ఘర్షణలో ఇరువురికి తీవ్రగాయాలు

కొత్తచెరువు: ఇంటిపట్టా విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ మంగళవారం రాత్రి మండల కేంద్రమైన కొత్తచెరువులో జరిగింది. పట్టణంలోని బీసీకాలనీకి చెందిన అస్లాం అనే వ్యక్తికి ఇంటిపట్టా మంజూరైనట్టు జాబితాలో ఉంది.అయితే మరుసటి రోజు జాబితాలో ఉన్న పేరు కనిపించకపోవడంతో అదే కాలనీకి చెందిన వైసీపీ నాయకుడు ముస్కీన్‌ ఇంటిపట్టా రాకుండా చేశాడని అతని ఇంటి వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగారు. దీంతో ఇరువురు కర్రలతో దాడులుచేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువురు తీవ్రం గా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టి గాయడిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఇరువర్గాల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


అర్హులైన మాకు పట్టాలివ్వరు -వైసీపీ నాయకుల ఆవేదన


కొత్తచెరువు: సుదీర్ఘకాలంగా వైసీపీకి పనిచేసిన తాము ఇళ్లపట్టాలకు అర్హులైనా పట్టాలు ఇవ్వలేదని అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని పలువురు వైసీపీ నా యకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మం డల కేంద్రమైన కొత్తచెరువు గ్రా మంలో 779 ఇళ్లపట్టాలను జాబితా సిద్ధం చేశారు. వీటిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఇందులో కూడా ఏకపక్షంగా లాటరీ నిర్వహించినట్టు వారు తెలిపారు. అంతేకాక గతంలో పట్టాలు పొందిన వారు తిరిగి మళ్లీ ఇళ్లజాబితాలో చోటు కల్పించడమే కాక ఇందులో అనేక అవకతవకలు అవినీతి జరిగినట్టు వారు ఆరోపించారు. తాము పార్టీకి ఎంత పనిచేసినా నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, మమ్మల్నీ ఏ నాయకుడు పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పాపన్న, గాజులనాగలక్ష్మీ, నారాయణస్వామి, సరోజమ్మ, నాగమణి, బాబా, వెంకటరాముడు, నాగరాజు, మహబూబ్‌బాషా, నూర్‌మహ్మద్‌, రామక్రిష్ణ తదితరులు మాట్లాడుతూ తమకు ఇళ్లపట్టాలు మం జూరుచేయలేదని, అధికారులు, నాయకులు చుట్టూ తిరిగినా పట్టాలు మాత్రం ఇవ్వలేదన్నారు. అంతేకాక 384 సర్వేనెంబర్‌లో కొంతమందికి మాత్రే ఇళ్లపట్టాలు ఇచ్చారని, మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. ఇందులో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. పట్టాలిచ్చిన వారిలో రేషన్‌కార్డులు లేనివారు, బయట ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నట్లు వైసీపీ నాయకులు పాపన్న తెలిపారు. తాను ఈ విషయంపై స్పందనలో అర్జీ అందజేశానని, వీటిపై విచారణ జరిపి అర్హులైన వారికి ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని కోరారు. 


ఇంటిపట్టాల కోసం కాలనీవాసుల ధర్నా 

పెనుకొండ: మండలం తిమ్మాపురం ఎస్సీకాలనీ వాసులు 40మంది ఇళ్లులేకుండా ఇబ్బంది పడుతున్నారని ఈనెల 25న జరిగిన ఇంటిపట్టాల పంపిణీలో తమకు ఇల్లు రాలేదని తమకు ఇల్లు మంజూరు చే యాలంటూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మంగళవారం సీపీఎం కార్యదర్శి రమేష్‌, ఎస్సీ కాలనీవాసులు వెంకటేష్‌, తిప్పన్న, సుబ్బన్న, అంజి, పల్లెన్న, వెంకటలక్ష్మీ, లక్ష్మమ్మ, జయమ్మ, కాలనీవాసులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి తమకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తారని ఆశతో ఎదురుచూశామన్నారు.  రాకపోవడంతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామన్నారు. ఉన్నవాళ్లకే ప్రభుత్వం ఇల్లు మంజూరు చే స్తోందని అర్హులైన తమను పట్టించుకోవడం లేదన్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలని కోరారు. 


Updated Date - 2020-12-30T06:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising