ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2020-12-13T06:12:50+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చే యాలని, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న దీక్షకు మద్దతుగా శనివారం మరూరు టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరూరు టోల్‌ ప్లాజా వద్ద వామపక్షాల ధర్నా

రాప్తాడు, డిసెంబరు 12: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చే యాలని,  రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న దీక్షకు మద్దతుగా శనివారం మరూరు టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. వాహనదారులు టోల్‌ చెల్లించవద్దని నిరసనకు దిగారు. ఈ సందర్బంగా మల్లికార్జున మాట్లాడుతూ... రైతులు 16 రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నా ప్రధాని ఏ మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ ఓబులు మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను 11 రాష్టాలు వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. అనంతరం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కాటమయ్య, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమెక్రసీ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ, రైతు సం ఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, యల్లన్న, నాగరాజు, మహదేవ, చలపతి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-13T06:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising