ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటా మార్కెట్‌పై కరోనా ప్రభావం!

ABN, First Publish Date - 2020-06-18T10:08:29+05:30

టమోటా మార్కెట్‌పై కరోనా ప్రభావం పడింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మండీలు తెరిచేందుకు నిర్వాహకులు జంకుతున్నారు. గతేడాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండీలు తెరిచేందుకు 

జంకుతున్న నిర్వాహకులు..


అనంతపురంరూరల్‌, జూన్‌17: టమోటా మార్కెట్‌పై కరోనా ప్రభావం పడింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మండీలు తెరిచేందుకు నిర్వాహకులు జంకుతున్నారు. గతేడాది ఇప్పటికే మండీలు తెరిచారు. ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తుండటం మండీ నిర్వాహకులను కలవరపెడుతోంది. దీంతో మండీలను తెరవాలా.. వద్దా.. అన్న సందిగ్ధంలో పడ్డారు. రాష్ట్రంలో టమోటా మార్కెట్‌కు మదనపల్లి పెట్టింది పేరు. తరువాతి స్థానం అనంతపురం సమీపంలోని కక్కలపల్లి మార్కెట్‌ సొంతం. ఒకానొక సందర్భంలో మదనపల్లి మార్కెట్‌ను సైతం మరిపించింది. మార్కెట్‌కు రైతులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మరోలా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మార్కెట్‌లో వ్యాపారాలు మరింత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.


గతేడాది ఇప్పటికే ప్రారంభం

గతేడాది ఈ సమయానికి మార్కెట్‌లో వ్యాపారాలను ప్రారంభించారు. క్రయవిక్రయాలు సాగాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్కెట్‌ తెరుచుకోలేదు. నిత్యం రైతులు, వ్యాపారులు తదితరులతో మార్కెట్‌ రద్దీగా ఉంటుంది. ఇతర ప్రాంతాల వారు కూడా వస్తారు. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి టమోటా ఎగుమతి అవుతుంది. వ్యాపారులు, వాహనదారులు ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. మార్కెట్‌లోని ఒక్కో మండీలో 50 మందికిపైగా కూలీలు పనులకు వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మండీలను ప్రారంభిస్తే వైరస్‌ ప్రబలుతుందన్న భయం మండీల నిర్వాహకులను వెంటాడుతోంది. దీంతో వారు జంకుతున్నారు. 


ఆలస్యంగా సాగు..

జిల్లాలో ఏటా దాదాపు 15 వేల హెక్టార్లలో టమోటా సాగువుతోంది. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో పంట సాగు ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది కరోనా కారణంగా రైతులు ఆలస్యంగా పంట పెట్టారు. దీంతో పంట మొదటి దశలోనే ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు కరోనా కారణంగా మార్కెట్‌ మరింత అసల్యంగా తెరుచుకోనుంది. ఇప్పటికే ఒకట్రెండు మండీలను ప్రారంభించినా కాయల కొనుగోలు, వ్యాపార లావాదేవీలు మాత్రం నిర్వహించట్లేదు. వైరస్‌ తగ్గుముఖం పడితే నెలాఖరుకు పూర్తిస్థాయిలో మార్కెట్‌లో వ్యాపారాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు మండీల నిర్వాహకులు చెబుతున్నారు. అప్పటికి రైతులకు పంట చేతికొచ్చే వీలుంటుందని అభిప్రాయ పడుతున్నారు.


Updated Date - 2020-06-18T10:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising