ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డు స్థాయిలో..

ABN, First Publish Date - 2020-05-09T09:48:40+05:30

జిల్లాలో శుక్రవారం రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురంలో 15, 

అనంతపురంలో ఒకరికి నిర్ధారణ

10 మంది పురుషులు.. 

ఆరుగురు మహిళలకు వైరస్‌

జిల్లాలో 126కు చేరిన కరోనా కేసులు


అనంతపురం వైద్యం, మే 8 : జిల్లాలో  శుక్రవారం రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.  మొత్తం 16 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో హిందూపురానికి చెందిన వారే 15 మంది ఉండగా అనంతపురానికి చెందిన ఒకరు ఉన్నట్టు అధికారుల బులెటిన్‌ విడుదల చేశారు అనంతపురం నగరంలోని రహమత్‌నగర్‌లో 35 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. హిందూపురంలో బాలాజీ నగర్‌కు చెందిన వ్యక్తి(60), హిందూపురం పట్టణానికి 50, 37, 36 సంవత్సరాల వ్యక్తులు 34, 26, 25, 18, 20 ఏళ్ల యువకులు, 17 ఏళ్ల యువతి, 44 ఏళ్ల మహిళలు ఇద్దరు, 25, 33, 34 సంవత్సరాల మహిళ కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఇలా 10 మంది పురుషులు, ఆరుగురు మహిళలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే జిల్లావాసులు 83 మంది కరోనా బారిన పడ్డారు. జిల్లాలో ఉంటున్న 26 మంది గుజరాతీలు, ఒక కర్ణాటక వాసి కరోనా బాధితుల్లో చేరా రు. తాజాగా 16 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 126కు పెరిగింది. 


కరోనా విజృంభణతో కలవరం

కరోనా విజృంభిస్తుండటంతో జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న సమయంలో జిల్లాలో కరోనా పడగ విప్పుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఒకేసారి 16 కేసులు నమోదు కావడం అందరికి ఆందోళన కలిగిస్తోం ది. జిల్లాలో హిందూపురం, అనంతపురం నగరాలు కరోనాకు కేరా్‌ఫగా మారిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 126 కేసులు నమోదు కాగా అందులో హిందూపురంలోనే 94 మంది ఉన్నారు. వారిలో హిందూపురం స్థానికులు 57 మంది ఉండగా గుజరాతీలు, కర్ణాటకవాసి కలిపి 27 మంది ఉన్నారు.  అనంతపురం నగరంలో 20 మంది, అనంతపురం రూరల్‌లో 02, కళ్యాణదుర్గం రూరల్‌లో 03, శెట్టూరు మండలంలో 02, లేపాక్షిలో మండలంలో 02, కొత్తచెరువు, గుంతకల్లు, రాప్తాడు, విడపనకల్లు, తాడిపత్రి, గుత్తి మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారు.


రాష్ట్రంలో అనంతకు 4వ స్థానం

కరోనా కేసులలో జిల్లాకు నాలుగో స్థానం దక్కింది.  రాష్ట్ర బులెటిన్‌ ఆధారంగా 547 కేసులతో కర్నూలు అగ్రస్థానంలో ఉండగా 374 కేసులతో గుంటూరు, 322 కేసులతో విజయవాడ(కృష్ణా) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 16 కేసులు నమోదు కావడంతో మొత్తం 126 కేసులతో అనంతపురం జిల్లా  నాల్గవ స్థానానికి చేరింది. 


అనంత మళ్లీ రెడ్‌జోన్‌గా మారనుందా ?

కరోనా కేసులు పెరగడంతో అనంతపురం జిల్లా మళ్లీ రెడ్‌జోన్‌గా మారనుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 100 కేసుల కన్నా తక్కువ ఉన్న జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లుగా గుర్తిస్తారు. ఇటీవల జోన్‌లు ప్రకటించినప్పుడు జిల్లాలో 79 కేసులు మాత్రమే ఉండేవి. దీంతో అనంతను ఆరెంజ్‌ జోన్‌గా లెక్కించారు. ఇప్పుడు జిల్లాలో కరోనా కేసులు అమాంతంగా పెరిగి 126కు చేరడంతో కేంద్రం నిబంధ నలు మేరకు రెడ్‌జోన్‌గా పరిగణిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే జిల్లా ప్రజలు మరికొన్ని రోజులు కరోనా కష్టాలు పడక తప్పదని వినిపిస్తోంది.


కరోనా నుంచి మరో ఇద్దరికి విముక్తి

 కరోనా వైరస్‌ నుంచి మరో ఇద్దరికి విముక్తి లభించింది. హిందూపురం హౌ సింగ్‌బోర్డు కాలనీకి చెందిన 24 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్ప త్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోవడంతో శుక్ర వారం ఆ యువకుడిని డిశ్చార్జ్‌ చేసినట్టు  కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. 


గుంతకల్లులోని ఆంటోని స్ర్టీట్‌కు చెందిన 48 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను తిరుపతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది కోలుకోవడంతో గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేసి గుంతకల్లుకు తరలించినట్లు తెలిపారు. ఇప్ప టి వరకూ జిల్లాలో 42 మంది కోలుకుని ఇంటికి చేరారని అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పద్మావతి తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన వారు 14 రోజుల పాటు హోంఐసోలేషన్‌లోనే ఉండాలని వారికి సూచించామని తెలిపారు. ఆర్డీటీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన యువకుడికి రూ. 2 వేలు నగదు అందజేసినట్లు తెలిపారు. 

Updated Date - 2020-05-09T09:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising