ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్‌ కంటతడి

ABN, First Publish Date - 2020-12-19T06:30:48+05:30

స్థానిక మార్కెట్‌యార్డులో శుక్రవారం డివిజనకు సంబంధించి ప్రభుత్వ భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి జేసీ-2 డాక్టర్‌ సిరి, సబ్‌ కలెక్టర్‌ నిషాంతి హాజరయ్యారు. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, త్వరితగతిన పను లు పూర్తిచే యాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అమరాపురం మండలం త మ్మిడేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ రామలింగప్ప అధికారులతో తమ కష్టాలు చెప్పుకుని కంటతడిపెట్టుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై సమీక్ష

పెండింగ్‌ బిల్లులు..ఇసుక కొరత తీర్చాలని కాంట్రాక్టర్లు వాగ్వాదం

సమస్యలు పరిష్కరిస్తాం: జేసీ-2 సిరి


పెనుకొండ, డిసెంబరు 18: స్థానిక మార్కెట్‌యార్డులో శుక్రవారం డివిజనకు సంబంధించి ప్రభుత్వ భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి జేసీ-2 డాక్టర్‌ సిరి, సబ్‌ కలెక్టర్‌ నిషాంతి హాజరయ్యారు. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, త్వరితగతిన పను లు పూర్తిచే యాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అమరాపురం మండలం త మ్మిడేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ రామలింగప్ప అధికారులతో తమ కష్టాలు చెప్పుకుని కంటతడిపెట్టుకున్నాడు. సమావేశానికి హాజరైన కాంట్రాక్టర్లు తాము చేపట్టిన పనులకు ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదన్నారు. ప్రభుత్వ పనులకు ఇ సుక దొరకని పరిస్థితి ఎదురైందన్నారు. ఇసుక రవాణాకు సచివాలయం నుంచి అనుమతులు తీసుకున్నా పోలీసుల నుంచి వేధింపులు అధికమయ్యాయని పనులు వే గ వంతం చేయాలంటే ఎలా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంత రం జేసీ సిరీ మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందులు తమకు అర్థమయ్యాయన్నారు. ఇసుక కొరత తీర్చడానికి కొత్తగా 11రీచలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తామన్నారు. అక్కడ ఇసుకఅయిపోతే వేరేచోటి నుంచి ఇసుకను డంప్‌చేసి కాంట్రాక్టర్లకు అందిస్తామన్నారు. పోలీసులు అడ్డురాకుం డా జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడతామన్నారు. పెండింగ్‌ బిల్లుల విషయ మై ఉన్నతాధికారులతో మాట్లాడానని బిల్లులు చెల్లిస్తామన్నారు. సమావేశంలో పం చాయతీరాజ్‌ ఎస్‌ ఈ మహేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్‌ ఈఈ గోపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ ఈ వెంకటరమణ, ఈఈ రామారావు, డీఈ మోహన, పీఆర్‌డీఈ మురళి, ఎంపీడీఓ శివశంకరప్ప, తహసీల్దార్‌ నాగరాజు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T06:30:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising