ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25లోపు నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-07-11T10:35:46+05:30

జిల్లాలో మనబడి నాడు-నేడు పనులన్నింటినీ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని సం బంధిత అధికారులను జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


అనంతపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మనబడి నాడు-నేడు పనులన్నింటినీ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని సం బంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు.  శుక్రవారం ఆయ న కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. నాడు-నేడు పనుల పురోగతిపై సమీక్షించారు.  ఈ సందర్భంగా నాడు-నేడు పనులకు సంబంధించి 84 శా తం నిధులు ఖర్చు చేసినందుకు ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఇంజనీర్లు సంబంధిత అధికారులను కలెక్టర్‌ అభినందించారు.


ఈ నెల 17లోపు వందశాతం ఖర్చు చేయాలని సూచించారు. 2009 పాఠశాలలు పునాది స్థాయికి చేరుకో లేదన్నారు. వాటన్నింటికీ పునాదులు వేసి పనులు ప్రారం భించాలన్నారు. అలా చేయని వారిపై చర్యలకు వెనకాడ బోనని హెచ్చరించారు. రెండు మండలాల్లో మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ప్రహరీలు, తాగునీటి పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. వారంతా నిర్దేశిత గడువులోగా పెండింగ్‌ పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. డీఈఓ శామ్యూల్‌ జిల్లాలో నాడు-నేడు పనుల పురోగతిని వివరించారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్‌, ఏపీసీ రవూఫ్‌, ఈఈ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-11T10:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising