ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2020-05-26T10:17:44+05:30

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రి, మే25: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ నాయకులు కేక్‌ కట్‌ చేసి, పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.


అనంతరం పట్టణంతోపాటు రూరల్‌లో ఉన్న వృద్ధ, అనాథాఆశ్రమాల్లో అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కులశేఖర్‌రెడ్డి, యుగంధర్‌, సోమశేఖర్‌నాయుడు, రఘునాథరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులునాయుడు, రామచంద్రనాయుడు, నాగేశ్వరరెడ్డి, జయచంద్రారెడ్డి, భరత్‌ పాల్గొన్నారు. యాడికి మండలం రాయలచెరువు లీలావతి వృద్ధాశ్రమంలో లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. పెద్దవడుగూరులో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, కన్వీనర్‌ కొండూరు కేశవరెడ్డి.. జేసీపీఆర్‌ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.'


బాలచెన్నారెడ్డి ఇందిరమ్మ కాలనీలో 200మందికి ఆహారపొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సూర్యప్రభాకర్‌రెడ్డి, గంగరాజుయాదవ్‌, లక్ష్మినారాయణ, మల్లికార్జునరెడ్డి, బాలిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, చిరంజీవులు, రమే్‌షయాదవ్‌, రవిశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, నారాయణస్వామి, బాషా తపాల్గొన్నారు. యల్లనూరు టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, అన్నమయ్య, జయరామకృష్ణ, తిమ్మంపల్లి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


చంద్రబాబు శుభాకాంక్షలు

అనంతపురం, మే25(ఆంధ్రజ్యోతి): తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు చంద్రబాబు సోమవారం ట్వీట్‌ చేశారు. ఆయురారోగ్యాలతో జీవించటంతోపాటు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-05-26T10:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising