ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ - తెలంగాణ బస్సు సర్వీసులు పునరుద్ధరణ

ABN, First Publish Date - 2020-11-03T23:20:20+05:30

ఏపీ - తెలంగాణ బస్సు సర్వీసులు పునరుద్ధరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం టౌన, నవంబరు 2 : ఆంధ్రప్రదేశ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించారు. ఇందులో భాగంగా అనంతపురం రీజియన నుంచి హైదరాబాద్‌కు బస్సు సర్వీసులను సోమవారం సాయంత్రం నుంచి పునఃప్రారంభించినట్టు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుమంత వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితులకు ముందు అనంతపురం రీజియన నుంచి హైదరాబాద్‌కు మొత్తం 41 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా... కరోనా కారణంగా మార్చి నెలాఖరునుంచి బ స్సులు ఎక్క డికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన ఆంక్షల సడలింపులతో మే నెలాఖరునుంచి బస్సు సర్వీసులు జి ల్లాలవారీగా పునఃప్రారంభమయ్యాయి. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులు మాత్రం పునఃప్రారంభానికి నోచుకోలేదు. కొంతకాలం తర్వాత కర్ణాటక - ఆంధ్రప్రదేశ రా ష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమన్వయంతో ఇరు రాష్ట్రాల నడుమ బస్సుసర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు ఆరున్నర నెలల తర్వాత తెలంగాణ రూట్‌కు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు పునఃప్రారంభానికి నోచుకున్నా యి. ఇందులో భాగంగా తొలిరోజున సోమవారం డిపోకు 1 బస్సు చొప్పున 13 డిపోల నుంచి 13 బస్సులను మా త్రమే హైదరాబాద్‌ రూట్‌కు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు పేర్కొంటున్నారు. తమిళనాడు రూట్‌కు అనుమతులు లభించకపోవడంతో  బస్సు సర్వీసులు ఇంకా పునఃప్రారంభమవలేదు.

Updated Date - 2020-11-03T23:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising