ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర సరిహద్దుల మూసివేతతో వలస కూలీల రాకకు బ్రేక్‌

ABN, First Publish Date - 2020-03-31T11:39:56+05:30

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర సరిహద్దులను మూసి వేయడంతో ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కూలీల బాధలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అడ్డుకుని వెనక్కి పంపుతున్న పోలీసులు


చిలమత్తూరు, మార్చి 30: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర సరిహద్దులను మూసి వేయడంతో ఇతర రాష్ర్టాలకు  చెందిన వలస కూలీల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్ర ధానంగా ఉత్తరాది రాష్ర్టాలైన ఉత్తరాఖాండ్‌, మధ్యప్రదేశ్‌, రా జస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌తో పాటు తెలంగాణ, ఒరిస్సాకు చెందిన వలస కూలీలు అత్యధికంగా బెంగళూరులో పలు ర కాలు పనులు చేసుకుంటూ జీవనం చేసుకుంటున్నారు. అ యితే కరోనా కట్టడికి దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించిన కారణంగా వారికి చేయడానికి ఎలాంటి పనులు లేకుండా పోయా యి.


దీంతో చేసేది లేక వారు తమ  స్వస్థలాలకు పయనమయ్యారు. కానీ లాక్‌డౌన్‌తో  జిల్లాల సరిహద్దులతో పాటు రా ష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేశారు. ఎట్టి పరిస్థితుల్లోనా ఇతర రాష్ర్టాల నుంచి ఎవ్వరినీ  రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో బెంగళూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టు మీదుగా వారి స్వస్థలాలకు చేరుకునేందు కు పలు రకాలుగా వలస కూలీలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చివరికి కొడికొండ చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు.


దాంతో పోలీసులు వారిని  రా ష్ట్రంలోకి రానీయకుండా అక్కడి నుంచి అటే బెంగళూరుకి తి రిగి పంపేస్తున్నారు. ఇలా రోజూ వందల మంది బెంగళూరు నుంచి రావడం, అక్కడ నుంచి పోలీసులు తిరిగి వెనక్కి పం పేయడం జరుగుతోంది. అసలే జీవనం కోసం సుదూర ప్రాం తాల నుంచి వలస వచ్చిన ఆ కూలీలకు ఎక్కడుండాలో తెలీక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి దుర్భర పరిస్థితి చూ సి కొందరు మానవత్వంతో ఆకలి తీర్చి అక్కడ నుంచి వెనక్కి పంపేస్తున్నారు. 

Updated Date - 2020-03-31T11:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising