ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై అప్రమత్తంగా ఉండండి

ABN, First Publish Date - 2020-07-06T10:49:13+05:30

కరోనా సోకకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు ఎస్పీ ఆదేశాలు..


అనంతపురం క్రైం, జూలై5: కరోనా సోకకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశించారు. ఆ దిశగా ఆయా ప్రాంతాల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ జిల్లావ్యాప్తంగా పోలీసుశాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజల ఆరోగ్య భద్రత దిశగా శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. విధిగా మాస్కులు, ఫేస్‌ షీల్డులు, శానిటైజర్లు వినియోగించి, భౌతికదూరం పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు.


రెడ్‌జోన్లలో ఉన్న సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. దీర్ఘకాలిక జబ్బులున్నవారు ఎప్పటికప్పుడు స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయా పోలీసుస్టేషన్లు, కార్యాలయాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మలేరియా, టైఫాయిడ్‌ తదితర సీజనల్‌ వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడాలన్నారు. జిల్లాలో కరోనా కట్టడితోపాటు మద్యం, ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. తనిఖీల సమయంలో వాహనచోదకులతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

Updated Date - 2020-07-06T10:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising