ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్శిల్‌ సర్వీసు ముసుగులో మద్యం రవాణా

ABN, First Publish Date - 2020-07-09T09:52:06+05:30

పట్టుచీరల మధ్యలో అట్టపెట్టెల్లో మద్యం బాటిళ్లను పెట్టి హైదరాబాద్‌ నుంచి ధర్మవరానికి ఎస్‌బీఆర్‌ఎస్‌ కార్గో పార్మిల్‌ సర్వీసు ట్రావెల్స్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ నుంచి ధర్మవరానికి..

సెబ్‌ అధికారుల దాడులు

రూ.1.61లక్షల  మద్యం, టొబాకో పొడి స్వాధీనం


ధర్మవరంఅర్బన్‌, జూలై 8: పట్టుచీరల మధ్యలో అట్టపెట్టెల్లో మద్యం బాటిళ్లను పెట్టి హైదరాబాద్‌ నుంచి ధర్మవరానికి ఎస్‌బీఆర్‌ఎస్‌ కార్గో పార్మిల్‌ సర్వీసు ట్రావెల్స్‌లో తరలిస్తుండగా ధర్మవరం సమీపంలో బుధవారం తెల్లవారుజామున సెబ్‌ అధికారులు వ లపన్ని పట్టుకున్నారు. స్థానిక ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో బుఽధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహన్‌రావు వెల్లడించిన వి వరాలు ఇలా ఉన్నాయి.


ధర్మవరం పట్టణానికి చెందిన చీరల వ్యాపారి కోనారెడ్డి మరో ఆరుగురు  పట్టుచీరల పెట్టె బాక్సుల్లో చీరలతో పాటు మద్యాన్ని ప్యాకింగ్‌ చేసి హైదరాబాద్‌లోని కాచిగూడలో ఎస్‌బీఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన  ఐషర్‌  వాహనంలో తరలిస్తున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అడిషనల్‌ ఎస్పీ రామ్మోహన్‌రావుకు పక్కా సమాచారం అందడంతో బుధవారం తెల్లవారుజామున బత్తలపల్లి మండలంలోని వేల్పుమడుగు గ్రామం వద్ద సిబ్బందితో కలిసి ఐషర్‌ వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో రూ.1.09 లక్షల మద్యం బాటిళ్లు, రూ. 52వేలు విలువజేసే పొగాకు సీజ్‌ చేశారు.  చీరల వ్యాపారి కోనారెడ్డితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలినవారిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-07-09T09:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising