సైనిక సంక్షేమ నిధికి మహిళా సంఘాల విరాళం
ABN, First Publish Date - 2020-12-15T06:56:48+05:30
సాయుధ దళాల పతాకదినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి మెప్మా ప రిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలు రూ.1,49,461 విరాళం అందజేశారు.
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 14: సాయుధ దళాల పతాకదినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి మెప్మా ప రిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలు రూ.1,49,461 విరాళం అందజేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చేతుల మీదుగా మెప్మా పీడీ రమణారెడ్డి జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి చంద్రశేఖర్‌కు చెక్ అందజేశారు. అనంతపురం నగరపాలకసంస్థ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలు అనంతసాయి రూ.15460, మదర్‌థెరిసా రూ.14620, ధర్మవరం రూ.16000, గుంతకల్లు రూ.18500, పామిడి రూ.4530, కదిరి రూ.12700, పుట్టపర్తి రూ.5400, రాయదుర్గం రూ.12111, తాడిపత్రి రూ.12500, గుత్తి రూ.5వేలు, హిందూపురం రూ.22వేలు, మడకశిర రూ.4500, కళ్యాణదుర్గం రూ.6వేలు మొత్తంగా 12మున్సిపాలిటీల డ్వాక్రా సంఘాల మహిళలు రూ.1,49, 461 విరాళం అందజేశారు. మెప్మా సిబ్బంది, డ్వాక్రా సంఘాల మహిళలను జిల్లా కలెక్టర్ అభినందించారు.
Updated Date - 2020-12-15T06:56:48+05:30 IST