ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్యాలమ్మకు బోనాలు

ABN, First Publish Date - 2020-10-28T09:38:18+05:30

మండలంలోని అరవకూరులో మంగళవారం ముత్యాలమ్మ దేవత బోనాల ఉత్సవం వైభవంగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూడేరు, అక్టోబరు 27: మండలంలోని అరవకూరులో మంగళవారం ముత్యాలమ్మ దేవత బోనాల ఉత్సవం వైభవంగా సాగింది.  ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు కొనసాగాయి. గ్రామ మహిళలు బోనాలకు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉం డాలని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌, పాఠశాల కమిటీ చైర్మన్‌ చెన్నయ్య, నాయకులు పుట్టా నరేష్‌, శ్రీరాములు, జీ ప్రసాద్‌, సంగన్న, విశ్వనాథరెడ్డి, శివారెడ్డి, ఓబులేసు, ఎర్రప్ప, ఎం నరేష్‌, నారాయణ పాల్గొన్నారు.


చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం

యాడికి : స్థానిక కోనరోడ్డులోని చౌడేశ్వరిదేవికి జ్యోతుల ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొగటవీర క్షత్రియులు ఆల యం ఎదుట ప్రత్యేక జ్యోతులను ప్రదర్శిస్తూ అమ్మవారి పాటలు ఆలపిస్తూ ఆడారు. జ్యోతులను తిలకించడానికి గ్రామస్థులు తరలివచ్చా రు. ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి.


లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు

పామిడి : స్థానిక అనంత గజ గరుడ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో మంగళవారం పాశాంకుశ ఏకాదశిని పురస్కరించుకొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున వేదపండితులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.


వైభవంగా మారెమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ 

బ్రహ్మసముద్రం: మండలంలోని నాగిరెడ్డిపల్లిలో వెలసిన మారెమ్మ దేవత నూతన విగ్రహాన్ని వైభవంగా ప్రతిష్ఠించారు. వేద పండితులచే అమ్మవారికి గణపతి పూజ, మాఘస్నానం, అభిషేకం, యంత్రపూజలు చేపట్టారు. గ్రామంలో నూతన ఆలయం నిర్మించి మారెమ్మదేవత విగ్రహం, ధ్వజస్తంభం, కలశ ప్రతిష్ఠాపన చేపట్టారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2020-10-28T09:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising