ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరూవాడా దసరా సంబరం

ABN, First Publish Date - 2020-10-27T10:15:14+05:30

దసరా పండుగను పట్టణ ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉద యం ఇళ్లల్లో పూజలుచేసి, పిండి వంటలు చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు టౌన్‌, అక్టోబరు 26: దసరా పండుగను  పట్టణ ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉద యం ఇళ్లల్లో పూజలుచేసి, పిండి వంటలు చేసుకున్నారు. సాయంత్రం కొత్త దుస్తులు ధరించి శమీ వృక్షాన్ని దర్శించుకున్నారు. పెద్దలకు పత్రిని ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థానిక వాసవీ ఆలయంలో ఎమ్మెల్యేలు వై వెంకటరామిరెడ్డి, ఆయన సోదరులు సాయి ప్రతాప్‌ రెడ్డి, బాల నాగిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలకు ప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. 


రాయదుర్గం రూరల్‌ : మండలంలో ఆదివారం దసరా వేడుకల్లో భాగంగా ఆదివారం ఆయుధపూజ  ఘనంగా ని ర్వహించారు. ఇళ్లల్లో పనిముట్లకు పూజలు చేశారు. సోమవారం సాయంత్రం జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

యాడికి : దసరా పండుగను పురస్కరించుకొని స్థానిక లక్ష్మిచెన్నకేశవస్వామి ఆలయంలో శమీ వృక్ష దర్శనాన్ని ఘ నంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను సంతమార్కెట్‌లోని శమీవృక్షం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. 

Updated Date - 2020-10-27T10:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising