ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగ పూటా తిప్పలే !

ABN, First Publish Date - 2020-10-27T10:09:08+05:30

ఉచిత సరుకుల కోసం పండుగపూట కూడా కార్డుదారులకు పడిగాపులు తప్పలేదు. సోమవారం ఏడో రోజు సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో ఉచిత సరుకుల పంపిణీ సవ్యంగా జరగలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎఫ్‌పీ షాపుల్లో తప్పని సర్వర్‌ కష్టాలు

 

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 26  : ఉచిత సరుకుల కోసం పండుగపూట కూడా కార్డుదారులకు పడిగాపులు తప్పలేదు. సోమవారం ఏడో రోజు సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో ఉచిత సరుకుల పంపిణీ సవ్యంగా జరగలేదు. అలాగే ఆదివారం పండుగ రోజు జనానికి సర్వర్‌ కష్టాలు తప్పలేదు. ఈసారి సరుకుల పంపిణీ ఆరంభం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్‌ మొరాయించింది. ఆ తర్వాత 3 గంటల వరకు నెమ్మదిగా పనిచేసింది. అనంతరం మళ్లీ సతాయించింది. దీంతో పండుగ పూట ఇవేం సర్వర్‌ కష్టాలంటూ కార్డుదారులు ఆక్రోశం వ్యక్తం చేశారు.  గంటల తరబడి ఎఫ్‌పీ షాపుల వద్దే పడిగాపులు కాశారు.


మరికొందరు ఎంత సేపటికి సర్వర్‌ పనిచేయకపోవడంతో నిరాశతో ఇంటి ముఖం పట్టారు. కొత్త వర్షన్‌ మార్పుతో  ఉచితంగా అందించే బియ్యం, శనగల కోసం రెండు సార్లు వేలిముద్రలు వేసేలా ఆప్షన్‌ ఇచ్చారు. అసలే సర్వర్‌ పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడిన కార్డుదారులకు కొత్త ఆప్షన్‌తో మరింత ఇక్కట్లకు గురయ్యారు. వారం రోజులుగా 7.76 లక్షల మందికి (61.84 శాతం) ఉచిత సరుకులు పంపిణీ చేశారు.  

Updated Date - 2020-10-27T10:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising