ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఈ-సెట్‌లో అనంత హవా

ABN, First Publish Date - 2020-10-07T08:51:25+05:30

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేన్‌టీయూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష (ఏపీఈసెట్‌ 2020)లో జిల్లా విద్యార్థులు టాపర్లుగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు


అనంతపురం అర్బన్‌, అక్టోబరు 6: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేన్‌టీయూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష (ఏపీఈసెట్‌ 2020)లో జిల్లా విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్‌ ఫలితాలను మంగళవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా విడుదల చేశారు. జేన్‌టీయూ వీసీ ఆచార్య శ్రీనివా్‌సకుమార్‌, ఏపీఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పీఆర్‌ భానుమూర్తి ఆన్‌ లైన్‌ ఫలితాలను విడుదల చేశారు.


ప్రథమ, ద్వితీయ ర్యాంకులను జిల్లా విద్యార్థులు సాధించటం, రాష్ట్రంలో అనంతను నెంబర్‌ వన్‌గా నిలపటంపై జేఎన్‌టీయూ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీఈసెట్‌ ఫలితాల్లో ఈ ఏడాది జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ప్రథమ ర్యాంకర్‌గా యాడికి మండలం పచారుమేకలపల్లికి చెందిన గొర్తి వంశీక్రిష్ణ, ద్వితీయ ర్యాంకర్‌గా తలుపుల మండలం వేపమానుపేటకు చెందిన గబ్డిరెడ్డి హర్షితారెడ్డి నిలిచారు. బీ ఫార్మసీలో హిందూపురానికి చెందిన రూప 36వ ర్యాంకు సాధించింది.


రైతు బిడ్డ.. స్టేట్‌ ఫస్ట్‌..

యాడికి: ఏపీ ఈ-సెట్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ ఫలితాల్లో మండలంలోని పచ్చారుమేకలపల్లికి చెందిన రైతు బిడ్డ గొర్తి వంశీకృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్‌ సాధించాడు. వంశీకృష్ణ తండ్రి గొర్తి రామ్మోహన్‌నాయుడు రైతు. తల్లి కళావతి గృహిణి. వంశీకృష్ణ అనంతపురం సెయింట్‌ థామస్‌ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివాడు. కలికిరి అగ్రికల్చర్‌ కళాశాలలో డిప్లొమో చేశాడు. ఏపీ ఈ-సెట్‌లో 116 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-07T08:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising