ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యూఎస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌

ABN, First Publish Date - 2020-10-01T09:49:29+05:30

పెనుకొండ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ దాసన్న బుధవా రం కాంట్రాక్టర్‌ నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.13 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం..

పెనుకొండ, సెప్టెంబరు 30: పెనుకొండ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ దాసన్న బుధవా రం కాంట్రాక్టర్‌ నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు.  అమరాపురం మండలానికి చెందిన కాంట్రాక్టర్లు మోహన్‌కుమార్‌, రాజ్‌కుమార్‌ 2018-19 సంవత్సరంలో సీఆర్‌ఆఫ్‌ నిధుల కింద వి.అగ్రహారం, వలస గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేశారు.


అందుకుగాను వారికి రూ.8.14 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. వీటి కి మడకశిర డీఈ, ఏఈలు ఎంబుక్కులు సిద్ధం చేసి, ఆర్‌డబ్ల్యూఎస్‌ పెనుకొండ ఈఈ కార్యాలయానికి పంపారు. ఏడాదిన్నర అయి నా బిల్లులు రాలేదు. వాటిని మంజూరు చే యటానికి ఈఈ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాసన్న.. కాంట్రాక్టర్లను రూ.19 వేలు లంచం ఇవ్వాలని డిమాం డ్‌ చేశాడు. చివరకు రూ.13 వేలు ఇవ్వటానికి కాంట్రాక్టర్లు అంగీకరించి, విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు.


బుధవా రం సాయంత్రం కాంట్రాక్టర్ల నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.13 వేల నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్‌ తెలిపారు. దాడిలో ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు. దాసన్నను కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నట్లు డీఎ్‌సపీ తెలిపారు.

Updated Date - 2020-10-01T09:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising