ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక చట్ట సవరణలను కేంద్రం విరమించుకోవాలి

ABN, First Publish Date - 2020-09-24T08:46:43+05:30

కార్మిక హక్కులను కాలరాసే చట్ట సవరణల బిల్లులను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్నాలో కార్మికసంఘాల నాయకులు


అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 23 : కార్మిక హక్కులను కాలరాసే చట్ట సవరణల బిల్లులను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌ నుంచి పలు కార్మికసంఘాల ఆధ్వర్యంలో సుభాష్‌రోడ్డు, టవర్‌క్లాక్‌ మీదుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కా ర్యాలయం వరకు భారీర్యాలీ నిర్వహించారు.


అనంతరం బీఎస్‌ ఎన్‌ఎల్‌, తపాలా కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబుళు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రా జారెడ్డి, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారిలో ఏమాత్రం చలనం లేదన్నారు.


కరోనాతో పనులు కోల్పోయిన కార్మికులకు రూ.10వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర స రుకులు ఇవ్వాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు నాగమణి, చియ్యేడు రామకృష్ణ, మల్లికార్జున, కృష్ణుడు, రాజేష్‌గౌడ్‌, కసాపురం ఆంజనేయులు, వెంకటనారాయణ, గోపాల్‌, రాజు, కృష్ణానాయక్‌, వేణుగోపాల్‌, రామాంజనేయులు, అక్బర్‌వలీ, నారాయణ, ఏసురత్నం పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T08:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising